టీజర్ తో పాజిటివ్ కన్నా ఎక్కువ నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువ తెచ్చుకున్న వార్ 2 ఇంకో రెండున్నర నెలల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఊహించని స్థాయిలో ప్రతికూల స్పందన రావడంతో డిఫెన్స్ లో పడ్డ యష్ రాజ్ ఫిలింస్ ప్రస్తుతం విఎఫ్ఎక్స్ ని మరోసారి చెక్ చేసే పనిలో పడింది. ఇదిలా ఉండగా వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీకి అసలు సవాల్ ఈ నెలలో ఎదురు కానుంది. ఎందుకంటే చాలా కీలకమైన జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబో సాంగ్ త్వరలోనే షూట్ చేయబోతున్నారు. ఇప్పటికే చాలా లేటైపోయింది. హృతిక్ గాయం వల్ల యాభై రోజులకు పైగా వాయిదా పడి ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లబోతోంది.
ఇది ఛాలెంజ్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆర్ఆర్ఆర్ నాటు నాటు రేంజ్ లో ఈ పాట మీద హైప్ నెలకొంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే పెద్ద ఎత్తున సెట్లు వేశారు. వందలాది జూనియర్ ఆర్టిస్టులను మాట్లాడుకున్నారు. కొరియోగ్రఫీ మీద ఫోకస్ పెట్టారు. ఇంతా చేశారు కానీ రాజమౌళి లాగా పర్ఫెక్షన్ కోసం పదే పదే రీ షూట్ చేసేంత టైం అయాన్ ముఖర్జీ దగ్గర లేదు. పైగా హృతిక్ పూర్తిగా కోలుకున్నాడు కానీ అతని ఫిట్ నెస్ హై వోల్టేజ్ డాన్స్ చేయించగలదా లేదానే అనుమానం తీసుకొస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తగినంత ప్రాక్టీస్ చేశాడనే టాక్ అయితే ఉంది. హృతిక్ కే కొంచెం తక్కువ టైం దొరికింది.
యష్ రాజ్ సంస్థ ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. ఆగస్ట్ 14నే వస్తున్న కూలి హైప్ ఏమో అంతకంత పెరుగుతోంది. దాన్ని తట్టుకోవడం తొలుత ఈజీ అనుకున్నారు కానీ లోకేష్ కనగరాజ్ మార్కెటింగ్ చూస్తేనేమో అంచనాలను హద్దులు దాటిస్తున్నాడు. సో వార్ 2 కాచుకోవాల్సిన సవాళ్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ది బెస్ట్ ఇస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదు. పైగా కూలి పాటలకు ధీటుగా వార్ 2కి ప్రీతమ్ ఎలాంటి సాంగ్స్ ఇచ్చి ఉంటాడోననే టెన్షన్ తారక్ ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. బిజినెస్ డీల్స్ అయితే ఇంకా పూర్తి కాలేదు. తెలుగు తమిళ హక్కులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
This post was last modified on June 1, 2025 4:04 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…