ఈ శుక్రవారం విడుదలైన సినిమాల్లో అందరి దృష్టి భైరవం, ఖలేజా మీద ఉండిపోయింది కానీ నరివెట్ట అనే మల్లువుడ్ డబ్బింగ్ రిలీజైన సంగతి చాలా మందికి తెలియదు. మైత్రి లాంటి ప్రముఖ సంస్థ పంపిణి చేసినా సరే కనీస ప్రమోషన్లు లేక ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. హైదరాబాద్ జనాలకు అవగాహన ఉంది కాబట్టి కాసిన్ని టికెట్లు తెగుతున్నాయి కానీ ఏపీ తెలంగాణలో చాలా చోట్ల అసలీ మూవీకి స్క్రీన్లు దొరకలేదన్నది వాస్తవం. ఒక్క అక్షరం అర్థం కాకుండా యధాతథంగా మళయాళం టైటిల్ నే పెట్టడం ఇంకాస్త దూరాన్ని పెంచింది. కనీసం తెలుగు పేరు పెట్టేంత ఓపిక, సమయం మన నిర్మాతలకు లేకుండా పోతోంది.
నరివెట్ట హీరో టోవినో థామస్. 2018, ఏఆర్ఎం, ఎల్2 ఎంపురాన్ లాంటి చిత్రాలతో ఇక్కడ గుర్తింపు వచ్చింది. అడవి మీద బ్రతుకుతూ అక్కడే జీవనోపాధి చూసుకుంటున్న గిరిజనులను ఖాళీ చేయించే బాధ్యత పడిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనకు మంచి స్కోపే దక్కింది. కథనం మరీ నెమ్మదిగా ఉండటం, అవసరం లేని ప్రేమకథకు ఎక్కువ నిడివి పెట్టడం లాంటి మైనస్సులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మంచి ప్రయత్నమని క్రిటిక్స్ మెచ్చుకున్నారు. కేరళలో వసూళ్లు బాగానే ఉన్నాయి. అక్కడ వారం రోజుల నుంచి బుక్ మై షో ట్రెండింగ్ లో ఉండగా మన దగ్గరే కొంత ఆలస్యంగా తీసుకొచ్చారు.
ఆ మధ్య ఆఫీసర్ ఆన్ డ్యూటీకి కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఓటిటిలో వచ్చాక చూసి మెచ్చుకున్న వాళ్ళు ఇది థియేటర్ రిలీజ్ కూడా అయ్యిందనే సంగతి తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ మాత్రం సంబరానికి ఇంత కష్టపడి థియేటర్లలో తేవడం ఎందుకనే కామెంట్లు అప్పుడూ వచ్చాయి. నరివెట్ట సంగతలా ఉంచితే ఇకపై టాలీవుడ్ ప్రొడ్యూసర్లు డబ్బింగ్ టైటిల్స్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాను రాను తమిళ, మలయాళ, కన్నడ పేర్లను అర్థం కావని తెలిసినా సరే అలాగే పెట్టేస్తున్నారు. కారణాలు ఏవైనా ఇది మాత్రం సమర్ధనీయం కాదు. నరివెట్టకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.
This post was last modified on May 31, 2025 9:46 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…