Movie News

కొత్త సినిమాలని రీ రిలీజులతో చంపొద్దు – మనోజ్

గత కొంత కాలంలో పాత సినిమాల రీ రిలీజులు కొత్త వాటి మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అయితే వీటి గురించి ఎవరూ పెద్దగా నోరు విప్పిన దాఖలాలు లేవు. రెండు మూడు రోజులు ఆడి వెళ్లిపోతాయి కదా మనకెందుకు లెమ్మని అందరూ సైలెంట్ గా ఉన్నారు. తాజాగా మంచు మనోజ్ స్పందించాడు. రీ రిలీజుల వల్ల ఎఫెక్ట్ అవుతున్న మాట వాస్తవమేనని, పెద్దలు దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, అవి వీక్ డేస్ లో వచ్చిన వాటి పుల్ తగ్గదని, కానీ వీకెండ్స్ లో వదలడం వల్ల ఒక తెలుగు సినిమాని మరో తెలుగు సినిమా చంపినట్టు అవుతోందని స్పష్టంగా వివరించాడు.

సీజన్లు, పండగలు ఇలా ఎన్నో డేట్లు అందరూ తీసేసుకుంటున్న తరుణంలో దీనికి పరిష్కారంగా పాత సినిమాలకు వీక్ డేస్ ఇవ్వడం న్యాయమనే ప్రతిపాదన భైరవం సక్సెస్ మీట్ లో తీసుకొచ్చాడు. నిజానికి మంచు మనోజ్ చెప్పింది అక్షర సత్యం. నిన్న గమనిస్తే ఖలేజా వల్ల భైరవం మీద బాగా ప్రభావం పడింది. మహేష్ బాబు మూడ్ లో పడిపోయి జనాలు బెల్లకొండ సాయిశ్రీనివాస్ మూవీని లైట్ తీసుకున్నారు. ఒకవేళ అది లేకపోయి ఉంటే ఖచ్చితంగా బెటర్ ఓపెనింగ్ వచ్చేదన్న ట్రేడ్ కామెంట్ ని కొట్టిపారేయలేం. టాక్ రాక ముందే భైరవం ఫస్ట్ డే వీకవ్వడం వెనుక ప్రధాన కారణం రీ రిలీజేనన్నది బయ్యర్స్ కామెంట్.

దీని మీద ఎవరైనా చొరవ తీసుకుని ఇకపై ఆలా ప్లానింగ్ జరిగేలా చేస్తారేమో చూడాలి. అయితే ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరించే టాలీవుడ్ లో ఇలాంటి విషయాల్లో ఐక్యతని ఆశించడం కష్టమే. ఎందుకంటే రీ రిలీజ్ అయినా సరే నా కెపాసిటీ తగ్గట్టు నేను విడుదల చేసుకుంటాను, నీ రేంజ్ కు తగ్గట్టు నువ్వు చేసుకోమంటూ పాత సినిమాల నిర్మాతలంటే ఎవరు మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. పైగా డిస్ట్రిబ్యూటర్లు సైతం రీ రిలీజులకు వస్తున్న స్పందన చూసి ఎక్కువ థియేటర్లు వచ్చేలా చేస్తున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో చెప్పుకోదగ్గ రీ రిలీజులు చాలానే ఉన్నాయి. మరి మనోజ్ ప్రపోజల్ ఎవరైనా పాటిస్తారేమో చూడాలి. 

This post was last modified on May 31, 2025 8:45 pm

Share

Recent Posts

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

10 minutes ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

38 minutes ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

1 hour ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

6 hours ago