ఎంత పెద్ద స్టార్ హీరో నటించినా సరే కొన్ని డిజాస్టర్లు ఫ్యాన్స్ సైతం కలలో తలుచుకోవడానికి కూడా ఇష్టపడరు. ఉదాహరణకు అఖిల్ ఏజెంట్, చిరంజీవి భోళా శంకర్, బాలకృష్ణ రూలర్ లాంటివి చెప్పుకోవచ్చు. రజనీకాంత్ కు అలాంటి మర్చిపోలేని కళాఖండం లాల్ సలామ్. థియేటర్లలో ఇది రిలీజై 1 సంవత్సరం 4 నెలలు గడిచిపోయాయి. కానీ డిజిటల్ మోక్షం దక్కలేదు. లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మించిన ఈ ప్యాన్ ఇండియా మూవీ ప్రేక్షకుల నుంచి దారుణ తిరస్కారానికి గురయ్యింది. రజని కూతురు ఐశ్వర్య దర్శకత్వం మీద క్రిటిక్స్ విరుచుకుపడ్డారు. తండ్రి అవమానంగా ఫీలయ్యే సినిమా తీశావంటూ తలంటారు.
చెన్నై టాక్ ప్రకారం గతంలో లాల్ సలామ్ ఓటిటి హక్కులు తొలుత కొన్నది నెట్ ఫ్లిక్స్. డిజిటల్ వెర్షన్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలున్న హార్డ్ డిస్క్ మాయమయ్యిందని ఐశ్యర్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాక ఓటిటి విడుదల ఆగిపోయింది. అది ఇస్తే తప్ప తమ ప్లాట్ ఫార్మ్ మీద స్ట్రీమింగ్ చేయమని నెట్ ఫ్లిక్స్ చెప్పిందట. పైగా తమకు చెప్పింది ఒకటి తీసింది ఒకటని, ఆ మేరకు అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనను సాకుగా చూపించి డీల్ క్యాన్సిల్ చేసుకున్నారట. పలు చర్చలు, ప్రయత్నాల తర్వాత చివరికి సన్ నెక్స్ట్ కు చేరుకుంది. జూన్ 7 బక్రీద్ సందర్భంగా అందుబాటులోకి తేబోతున్నారు.
ట్విస్ట్ ఏంటంటే లాల్ సలామ్ చూడని ఆడియన్స్ కోట్లలో ఉన్నారు. రిలీజ్ టైంలో రివ్యూలు, పబ్లిక్ టాక్, సోషల్ మీడియా ట్రోలింగ్ చూసి భయపడి ఎవరూ దాని జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఓటిటి అంటే వ్యూస్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఏజెంట్ కూడా ఇదే తరహాలో విపరీతమైన ఆలస్యానికి గురైన సంగతి తెలిసిందే. ఫైనల్ గా డిజిటల్ లోకి వచ్చాక ఎవరూ పట్టించుకోలేదు. లాల్ సలామ్ కి దీనికి భిన్నమైన స్పందన వస్తే మంచిదే. జైలర్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా లాల్ సలామ్ కొచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద తుస్సుమని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
This post was last modified on May 31, 2025 10:07 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…