కన్నడ భాష గురించి థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు చాలా దూరం వెళ్లిపోయాయి. రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే సినిమాను నిషేధిస్తామని కర్ణాటక ఫిలిం ఛాంబర్ హుకుం జారీ చేసి, దాని ప్రకారం బ్యాన్ ప్రకటన ఇచ్చేసింది. ఇది జరగడానికి ముందు కమల్ మాట్లాడుతూ ఒక ఎజెండా పెట్టుకుని పనిచేసే వాళ్లకు సమాధానం ఇవ్వనని, తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పే సమస్య లేదని, ఒకవేళ చేసి ఉంటే సారీ చెబుతానని, ఇది నా లైఫ్ స్టైల్ అంటూ మీడియా ముఖంగా చెప్పడంతో కాంట్రావర్సి ముదిరింది. దీంతో కన్నడనాట జూన్ 5 థగ్ లైఫ్ కి దారులు మూసుకుపోయాయి.
ఇప్పుడీ వివాదం శివరాజ్ కుమార్ ని సైతం చుట్టుకుంటోంది. కమల్ ని సమర్థిస్తూ ఇటీవలే ఆయన చేసిన కామెంట్లు అగ్ని ఆజ్యం పోసినట్టయ్యింది. లోక నాయకుడిని విమర్శించడానికి బదులు చిన్న బడ్జెట్ కన్నడ సినిమాలను మీరు ప్రోత్సహించడం లేదంటూ శాండల్ వుడ్ మీడియా, ఇతర వర్గాలకు క్లాస్ తీసుకోవడం నిరసనకారులకు కోపం తెప్పించింది, దీంతో సౌమ్యుడిగా పేరున శివన్నను సైతం కొందరు టార్గెట్ చేసుకుంటున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న శాండల్ వుడ్ పెద్దలు ఇది ఎక్కడిదాకా వెళ్తుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కమల్ సారీ చెప్పకుండా థగ్ లైఫ్ బ్యాన్ కి కారణం కావడం వల్ల భవిష్యత్తులో కన్నడ సినిమాలకు తమిళనాడులో, తమిళ చిత్రాలకు కర్ణాటకలో చిక్కులు తప్పకపోవచ్చు. దీని వల్ల కోట్ల రూపాయల వ్యాపారం పోయి నష్టం కలుగుతుంది. కమల్ ఈగోతోనే సారీ చెప్పడం లేదని ఫిలిం ఛాంబర్ పెద్దలు భావిస్తుండగా ఫ్యాన్స్ మాత్రం ఆయన మాటలను వక్రీకరించారంటూ సమర్ధన అందుకున్నారు. తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ చెప్పడం ఈ రచ్చకు ప్రధాన కారణం. ప్రస్తుతానికి ఈ మూవీ కన్నడ డిస్ట్రిబ్యూటర్లు ఈ పరిణామాల పట్ల తీవ్ర టెన్షన్ తో ఉన్నారు. థగ్ లైఫ్ నిర్మాత కూడా కమలే కాబట్టి ఈ ఆర్థిక వ్యవహారాలను ఎలా చక్కదిద్దుతారో చూడాలి.
This post was last modified on May 30, 2025 7:17 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…