అసలు విడుదల టైంలో ఫ్లాప్ గా నిలిచి ఇప్పుడు రీ రిలీజ్ సందర్భంగా రికార్డులు బద్దలు కొడుతున్న ఖలేజా నిన్న సాయంత్రం నుంచే ప్రీమియర్లు మొదలుపెట్టింది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి నగరాల్లో అభిమానుల సందడి మాములుగా లేదు. ముఖ్యంగా ఆర్టిసి క్రాస్ రోడ్స్ దగ్గర సందోహం చూసేందుకు రెండు కళ్ళు చాలవనేంత సందడి వాతావరణం నెలకొంది. ఇంత హంగామా మధ్య థియేటర్లలో అడుగు పెట్టిన ఫ్యాన్స్ కి షాక్ తగిలింది. సెకండాఫ్ లో వచ్చే సండే మండే పాట, మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఉన్న సన్నివేశాలు కొన్ని కోతకు గురవ్వడంతో ఆందోళన చెంది కొన్ని చోట్ల షోలు ఆపేశారు.
సాంకేతిక సమస్యా లేక ఎడిటింగ్ లో పోయాయో చెప్పలేదు కానీ నిజానికి ఇక్కడ థియేటర్ యాజమాన్యాల తప్పేమీ లేదు. శాటిలైట్ నుంచి వచ్చిన ప్రింట్ ని యధాతథంగా ప్రదర్శించారు తప్పించి వాళ్ళుగా కోరుకున్నా ఎలాంటి కట్స్ చేయలేరు. ఈ లాజిక్ మిస్సైన కొందరు అభిమానులు పలు చోట్ల గొడవలు చేయడం సోషల్ మీడియాలో కనిపించింది. ఇంత తీవ్ర నిరసన ఊహించని ఖలేజా టీమ్ రాత్రికి రాత్రి రిపేర్లు చేసి తొలగించిన కంటెంట్ ఇవాళ్టి నుంచి స్క్రీన్ అయ్యేలా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీంతో అందరూ హమ్మయ్యా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు షోలు చాలా కీలకం కాబోతున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సుమారు ఆరు మూడు దాకా వసూళ్లు చేసిందని చెబుతున్న ఖలేజా ఫైనల్ రన్ లోపు టాలీవుడ్ రీ రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త సినిమా భైరవం దీని దెబ్బకే వెనుకబడిపోవడం ఊహించని పరిణామం. అయినా ఎప్పుడో జమానాలో వచ్చిన సినిమా అయితే రీల్స్ దొరకలేదనో నెగటివ్ మిస్సయ్యిందనో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ లోనే ఉన్న ఖలేజాకు కూడా ఇలాంటి కట్స్ ఉండటం ఖచ్చితంగా టీమ్ వైపు నుంచి జరిగిన తప్పే. ఏదైతేనేం కథ సుఖాంతమయ్యింది. ఇవాళ్టి నుంచి ఖలేజా ఫుల్ వెర్షన్ ని అభిమానులు బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయొచ్చు.
This post was last modified on May 30, 2025 12:05 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…