అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో రూపొందబోయే ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హీరోయిన్లుగా దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ దాదాపు లాకైనట్టేనని ఇన్ సైడ్ టాక్. ఇంకో ఇద్దరు ఉంటారనే న్యూస్ ఉంది కానీ వాళ్ళ పేర్లు నిర్ధారణగా తెలియలేదు. భాగ్యశ్రీ బోర్సేని అడిగినట్టుగా లీక్ ఉంది. ఇదిలా ఉండగా దీనికి టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో అట్లీ ఉన్నాడట. ఐకాన్, సూపర్ హీరో లాంటి పలు ఆప్షన్లు బన్నీ ముందు పెడితే ఎలాగూ మొదటిది బిరుదుగా ఉంది కనక దానివైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఈ ఐకాన్ వెనుకో చిన్న స్టోరీ ఉంది. పుష్ప టైంలో నిర్మాత దిల్ రాజు ఐకాన్ టైటిల్ తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ప్రీ లుక్ పోస్టర్ కూడా వదిలారు. రోడ్ జర్నీ నేపథ్యంలో డిఫరెంట్ గా ఉంటుందని ప్రైవేట్ టాక్స్ లో అనేవారు. కానీ పుష్ప బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ మనసు మారిపోయింది. దీంతో దిల్ రాజు తనను నమ్ముకున్న వేణు శ్రీరామ్ కి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు నితిన్ తమ్ముడు ఇచ్చి ఆ లోటుని భర్తీ చేశారు. ఐకాన్ టైటిల్ ఇప్పటికీ సేఫ్ గా ఉంది. అల్లు అర్జున్ అడిగితే రాజుగారు కాదనలేరు. సో అన్ని భాషలకు సూటయ్యేలా దీన్నే లాక్ చేయొచ్చని బలంగా వినిపిస్తోంది.
పుష్ప 2 ఆల్ ఇండియా రికార్డులు సాధించాక బన్నీ మరింత జాగ్రత్త పడుతున్నాడు. తన ప్రతి సినిమాకు డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో ముందే అంచనా వేసుకుని దానికి తగ్గట్టు బడ్జెట్ లు, కాంబోలు సెట్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక కారణం కూడా అదే. ఎంత ఖర్చయినా పర్వాలేదనే నిర్మాత కళానిధి మారన్ తో వ్యవహారం ఎలా ఉంటుందో తనకు తెలుసు. అయిదు వందల కోట్లు కాదు అంతకు డబుల్ అయినా ఆయన లెక్క చేయరు. ఏడాదిలోగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి తగినంత సమయం పెట్టుకుని 2027 సంక్రాంతి రిలీజ్ ని లక్ష్యంగా పెట్టుకున్నారట.
This post was last modified on May 28, 2025 10:10 am
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…