ఇప్పటికే పైరసీ, వీడియో లీకులతో సతమతమవుతున్న టాలీవుడ్ మరో కొత్త రకం దారుణాలు చవి చూడాల్సి వస్తోంది. జూన్ 27 విడుదల కాబోతున్న కన్నప్పకు సంబంధించి కీలక దృశ్యాలున్న హార్ట్ డిస్క్ ఒకటి మాయమయ్యిందనే వార్త అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ప్యాన్ ఇండియా మూవీకి విఎఫ్ఎక్స్ చేసిన ముంబై కంపెనీ దాన్ని మంచు విష్ణు ఆఫీస్ కు పంపిస్తే, ఆ డ్రైవ్ ని ఆఫీస్ బాయ్ నుంచి చరిత అనే ఉద్యోగి తీసుకెళ్లిందని, ఇప్పటిదాకా జాడ తెలియడం లేదని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదయ్యింది. దాంట్లో ఎంత డేటా ఉంది, ఎంత నిడివి లాంటి వివరాలు కంప్లైంట్ లో పొందుపరిచారట.
సరిగ్గా ఇంకో నెల రోజుల్లో రిలీజ్ ఉండగా ఇలా జరగడం మంచు ఫ్యామిలీని ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఇది ఆషామాషీ సినిమా కాదు. వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన ప్యాన్ ఇండియా మూవీ. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి భారీ క్యాస్టింగ్ భాగమయ్యారు. విష్ణు ఎడతెరిపి లేకుండా బయట ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే డబ్బింగ్ పనులు మొదలుపెట్టబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది. ఇలాంటి టైంలో హఠాత్తుగా హార్డ్ డ్రైవ్ లాంటివి అదృశ్యం కావడం చాలా తీవ్ర పరిణామమనే చెప్పాలి.
నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరి నమ్మక ద్రోహం వల్ల ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గేమ్ చేంజర్ ఎడిటింగ్ రూమ్ నుంచే పైరసీ కాపీ బయటికి వెళ్లిపోవడం గురించి ఇప్పటిదాకా దోషులెవరో సరయిన రీతిలో బయటపడలేదు. ఆ నేరం శాటిలైట్ లో జరిగిందా లేక లోపలున్న వాళ్ళు చేశారా అనేది ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కన్నప్పకు ఇలాంటి అన్యాయం జరగడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. పోలీసులు వెంటనే రంగంలో దిగి దీనికి బాధ్యులైన వాళ్ళ కాల్ డేటా, లొకేషన్లు తదితరాలు ఆరా తీసే పనిలో ఉన్నారట. వాళ్ళు దొరికితే చాలు ఫ్యాన్స్ రిలాక్సవుతారు.
This post was last modified on May 27, 2025 9:33 am
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…