మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత గ్యాప్ వచ్చేసిన నవీన్ పోలిశెట్టి త్వరలో అనగనగా ఒక రాజుగా రాబోతున్నాడు. వచ్చే ఏడాది 2026 జనవరి 14 విడుదల తేదీని ఖరారు చేస్తూ సితార సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చేసింది. పండక్కు వచ్చే సినిమాల్లో టాలీవుడ్ నుంచి ఫస్ట్ డేట్ లాక్ చేసుకున్న సినిమా ఇదే. దీని కన్నా ముందు మెగా 157 సంక్రాంతికి అన్నారు కానీ తేదీ చెప్పలేదు. షూటింగ్ అయ్యాక అప్పుడు నిర్ణయిద్దామనుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడీ పరిణామంతో త్వరలోనే డెసిషన్ తీసుకునే అవకాశం లేకపోలేదు. పండగని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకునే ఉద్దేశంలో తను ఎంత మాత్రం లేడు
ఇంత హఠాత్తుగా అనగనగా ఒక రోజు తొందరపడటం వెనుక కారణం లేకపోలేదు. అఖండ 2 ఒకవేళ రాబోయే సెప్టెంబర్ మిస్ చేసుకుంటే బాలయ్య సెంటిమెంట్ ప్రకారం జనవరికి వెళ్లే అవకాశముంది. ఆల్రెడీ విజయ్ చివరి సినిమా జన నాయగన్ ఎప్పుడో కర్చీఫ్ వేసుకుని ఉంది. అదే జరిగితే బాలకృష్ణ, చిరంజీవి, విజయ్ లతో పాటు ఇంకొక్కరికే ఛాన్స్ ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకునే ఉద్దేశంతో నవీన్ పోలిశెట్టి టీమ్ ఈ రకంగా ఎత్తుగడ వేసిందన్న మాట. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ కు మారి దర్శకత్వం వహిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
పండగ బరి నుంచి ఎన్టీఆర్ నీల్ సినిమా తప్పుకోవడం వల్ల మిగిలిన వాళ్లకు ఛాన్స్ దొరికింది. ఇక్కడ ఇంకో విషయం మర్చిపోకూడదు. ఒకవేళ ది రాజా సాబ్ కనక ఈ ఏడాది డిసెంబర్ లోగా రాకపోతే అది కూడా జనవరినే టార్గెట్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పటికిప్పుడు అది తేలేలా లేదు. మిరాయ్ కి ఏ తేదీ అనుకుంటున్నారో దాని బట్టి రాజా సాబ్ ది నిర్ణయించుకోవాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆలోచన. మిరాయ్ టీజర్ లో ఆగస్ట్ 1 కాకుండా వేరే డేట్ ఉంటే ప్లాన్ మారినట్టే లెక్క. మొత్తానికి ఏడు నెలల ముందే 2026 సంక్రాంతికి సంబంధించిన బాక్సాఫీస్ సర్కస్ మొదలైపోయింది.
This post was last modified on May 26, 2025 6:08 pm
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…