పవన్ కళ్యాణ్ అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఓజి నుంచి కీలకమైన అప్డేట్ వచ్చేసింది. విడుదల తేదీని సెప్టెంబర్ 25కి లాక్ చేస్తూ డివివి ఎంటర్ టైన్మెంట్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. నిజానికి ఈ తేదీని గతంలో అఖండ 2 తాండవం, సంబరాల ఏటిగట్టు అఫీషియల్ గా లాక్ చేసుకుని ఆ మేరకు అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాయి. కానీ షూటింగ్ లో జరుగుతున్న జాప్యంతో పాటు బ్యాలన్స్ ఇంకా ఉండటంతో ఆ డేట్ ని అందుకోవడం కష్టంగా ఉందట. అందుకే ఓజికి రూట్ క్లియరయ్యిందని టాక్. ఆయా నిర్మాతలను సంప్రదించి సమాచారం తెలుసుకున్నాకే ఓజికి ముహూర్తం నిర్ణయించారట.
ఎలా చూసుకున్నా ఓజి మంచి డేట్ పట్టేసుకుంది. సెప్టెంబర్ 25 తో మొదలుపెట్టి అక్టోబర్ మొదటివారం పూర్తయ్యేదాకా వరసగా సెలవులు ఉన్నాయి. దీనికున్న క్రేజ్ దృష్ట్యా టాక్ జస్ట్ యావరేజ్ వచ్చినా చాలు రికార్డులకు పాతర పడిపోతుంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే మాత్రం మొదటిరోజు లెక్క వంద కోట్ల నుంచి మొదలుపెట్టొచ్చు. రాజకీయ కార్యకలాపాలకు వీలైనంత బ్రేక్ ఇస్తూ షూటింగ్స్ లో పాల్గొంటున్న పవన్ ఇటీవలే వీరమల్లుని పూర్తి చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే నెల నుంచి సెట్స్ లో అడుగు పెట్టనుంది. ఈ లోగా ఓజికి దర్శకుడు సుజిత్ దాదాపు గుమ్మడికాయ కొట్టేస్తాడు.
ప్రమోషన్ల విషయంలో ప్రత్యేకతను చాటుకునే డివివి టీమ్ జూన్ 12 తర్వాత కొద్దిరోజులు ఆగి వేగం పెంచనుంది. హరిహర వీరమల్లు రిలీజై దాని బాక్సాఫీస్ రన్ పూర్తయ్యాక ఓజి పబ్లిసిటీని పెంచబోతున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా పరిచయమవుతున్నాడు. ఓజి రెండు భాగాలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది కానీ నిర్ధారణగా తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. తమన్ సంగీతం ఓజికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఈసారి పాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఫ్యాన్స్ ని తెగ ఊరిస్తున్నాడు. బీజీఎమ్ మీద కూడా అంతే అంచనాలున్నాయి.
This post was last modified on May 25, 2025 10:46 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…