Movie News

నాగ్.. దాన్ని కొంచెం పైకి లేపాలి

అక్కినేని నాగార్జున నుంచి సోలో హీరోగా సినిమా వ‌చ్చి ఏడాదిన్న‌ర కావ‌స్తోంది. గ‌త సంక్రాంతికి ఆయ‌న నా సామి రంగ మూవీతో ప‌ల‌క‌రించారు. ఆ త‌ర్వాత హీరోగా సినిమా మొద‌లుపెట్ట‌నే లేదు. అలా అని ఆయ‌నేమీ న‌ట‌న‌కు దూరం అయిపోలేదు. కూలీ, కుబేర అంటూ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. వీటిలో కూలీకి మామూలు క్రేజ్ లేదు. నాగ్ చేస్తున్న పాత్ర మీదా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇటీవ‌లే రిలీజ్ చేసిన చిన్న గ్లింప్స్‌లో నాగ్ ముఖం చూపించ‌కుండానే అభిమానుల‌కు గూస్ బంప్స్ ఇచ్చేశాడు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్.

కూలీ సినిమాకు అంత‌కంత‌కూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగులో బిజినెస్ కూడా అంచ‌నాల‌కు మించి జ‌రుగుతున్న‌ట్లు సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఐతే నాగ్ న‌టించిన రెండు చిత్రాల్లో ఆల‌స్యంగా రిలీజ‌య్యేది ఇదే. ఆగ‌స్టు 14న కూలీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. దానికి రెండు నెలల ముందే కుంబేర విడుద‌ల కావాల్సి ఉంది. ఐతే ఈ చిత్రానికి పెద్ద‌గా హైప్ క‌నిపించ‌డం లేదు. చాన్నాళ్లుగా ఈ సినిమా అస్స‌లు వార్త‌ల్లో లేక‌పోవ‌డమే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.

కుబేర మేకింగ్ కూడా చాలా కాలం సాగింది. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. కూలీలో కంటే కుబేర‌లోనే నాగ్ పాత్ర కీల‌కం. ఆయ‌న‌కు ఇందులో స్క్రీన్ టైం కూడా ఎక్కువేన‌ట‌. ఐతే ఇది మాస్ సినిమాలా క‌నిపించ‌క‌పోవ‌డంతో బ‌జ్ క్రియేట్ కాలేదు. ధ‌నుస్ హీరో కావ‌డం వ‌ల్ల కూడా తెలుగులో హైప్ త‌క్కువే ఉంది. నాగ్ ప్ర‌మేయం లేకుండానే కూలీకి కావాల్సినంత హైప్ వ‌చ్చింది తెలుగులో.

కానీ ముందు రిలీజ్ కాబోతున్న కుబేర‌కు బ‌జ్ క్రియేట్ కాలేదు. దీని మీద నాగ్ ఫోకస్ పెట్టాల్సిన అవ‌స‌ర‌ముంది. ధ‌నుష్ ఈ సినిమాకు తెలుగులో త‌న వంతుగా క్రేజ్ తీసుకొచ్చేదేమీ లేదు. నాగార్జునే ఈ విష‌యంలో చొర‌వ తీసుకుని గ‌ట్టిగా ప్ర‌మోట్ చేసి హైప్ పెంచాల్సిన అవ‌స‌ర‌ముంది. అంత‌కంటే ముందు నాగ్ పాత్ర మీద స్పెష‌ల్ టీజ‌ర్ లాంటిది వ‌ద‌ల‌డం.. ఆయ‌నే కేంద్రంగా ప్ర‌మోష‌న్లు ప్లాన్ చేయ‌డం చాలా అవ‌స‌రం. అప్పుడే కుబేర‌కు కావాల్సిన బ‌జ్ వ‌స్తుంది.

This post was last modified on May 24, 2025 5:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago