ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాడు ఆమిర్. ఇండియాలో చాలామంది స్టార్ల సినిమాలకు వంద కోట్ల మార్కెట్ ఉన్న సమయంలోనే ఆయనకు మూణ్నాలుగొందల కోట్ల వసూళ్లు కేక్ వాక్‌లా ఉండేవి. లగాన్, రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను ఎప్పటికప్పుడు తిరగరాస్తూ సాగిపోయారు ఆమిర్. ‘దంగల్’ సినిమా చైనాలో కూడా అదరగొట్టడంతో ఏకంగా రూ.2 వేల కోట్ల మైలురాయిని సైతం ఆమిర్ అందుకున్నారు. అలాంటి హీరోకు వంద కోట్ల వసూళ్లు కూడా గగనం అయిపోయే పరిస్థితి విడ్డూరం.
‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రంతో ఆయన కెరీర్ తిరగబడింది. ‘లాల్ సింగ్ చడ్డా’తో ఆయన ఒకేసారి పాతాళానికి పడిపోయారు. ఆ హాలీవుడ్ రీమేక్ మీద విపరీతమైన నెగెటివిటీ మొదలై.. తొలి రోజు మినిమం ఆక్యుపెన్సీలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సినిమాకు మాత్రమే అనుకోకుండా అలా జరిగిందని.. ఆమిర్ తర్వాతి చిత్రంతో బలంగా పుంజుకుంటాడని అభిమానులు ఆశించారు. కానీ వాస్తవం వేరుగా ఉంది. ఆమిర్ కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ చుట్టూ కూడా ‘లాల్ సింగ్ చడ్డా’ తరహాలోనే నెగెటివిటీ ముసురుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమా ట్రైలర్ రాక ముందే కథ వేరు. అది వచ్చాక వ్యవహారం వేరు. ఇది కూడా ఫారిన్ సినిమా రీమేక్ అని తేలిపోవడంతో దాన్ని నెటిజన్లు టార్గెట్ చేశారు. అచ్చం ‘లాల్ సింగ్ చడ్డా’ టైంలో ఎలా అయితే అదే పనిగా నెగెటివిటీ చూపిస్తూ బాయ్‌కాట్ ఉద్యమం చేశారో.. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. ఈ సినిమా మీద చాలా ఆశాభావంతో ఉన్న ఆమిర్ అండ్ కో ఇప్పుడు బాగా డీలా పడిపోయినట్లు తెలుస్తోంది.
జూన్ 20న సినిమాను రిలీజ్ చేయానికి భయపడుతున్నారు. బయ్యర్లు, ఎగ్జిబిటర్లలోనూ భయం మొదలైనట్లు కనిపిస్తోంది. బాలీవుడ్లో రీమేక్‌లు చేయని హీరోలు లేరు. కానీ ఆమిర్ మీద మాత్రమే ఇలాంటి వ్యతిరేకత ఏంటన్నది ప్రశ్నార్థకం. ఒక సినిమా వరకు అంటే ఓకే కానీ.. ఇలా ఆమిర్ చేసి ప్రతి చిత్రాన్నీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తే.. ఇక అతను సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోవడం మినహా చేయగలిగిందేమీ లేదు. ఒకప్పుడు భారతీయ ప్రేక్షకులంతా సెలబ్రేట్ చేసిన హీరోకు ఇలాంటి పరిస్థితి రావడం శోచనీయం.
This post was last modified on May 24, 2025 5:08 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…