దగ్ లైఫ్ ట్రైలర్ చూశాక షాక్ కి గురి చేసిన అంశాల్లో ప్రధానమైంది త్రిష పాత్ర. కమల్ హాసన్ తనతో రొమాన్స్ చేసినట్టుగా చూపించడం అభిమానులు ఉహించలేదు. ఎందుకంటే వినైతండి వరువాయ (ఏ మాయ చేసావే తమిళ వెర్షన్) లో శింబుతో త్రిష చూపించిన కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా పండిందో ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. గత పదిహేనేళ్లుగా చెన్నైలో డైలీ సింగల్ షోతో ఇప్పటికీ ఈ సినిమా ప్రదర్శింపబడటం సౌత్ ఇండియాలో కొత్త రికార్డు. అలాంటి క్లాసిక్ లో భాగం పంచుకున్న త్రిష ఇప్పుడు దగ్ లైఫ్ లో శింబు పక్కన కాకుండా కమల్ హాసన్ తో జంట కట్టడం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు.
దీంతో సోషల్ మీడియాలో కొందరు త్రిషని ద్రోహిగా వర్ణించడం మొదలుపెట్టారు. ఇది తన దాకా వెళ్ళింది. ఒక తమిళ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను ద్రోహి అనడం చూశానని, అయితే సినిమాలో అంతకన్నా పెద్ద షాక్ ఉంటుందని, దానికి సిద్ధం కమ్మని చెప్పడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ తిన్నారు. అది చూశాకే శింబుకి జోడి ఉంటుందో లేదో అర్థమవుతుందని చెప్పింది. దీంతో ఏదో పెద్ద సస్పెన్స్ సినిమాలో ఉందని అర్థమైపోయింది. ట్విస్ట్ ఏంటంటే మెయిన్ హీరోయిన్లు అభిరామి, త్రిష ఇద్దరూ కమల్ తో ఆడిపాడారు కానీ శింబుకి జోడి ఎవరో ఎక్కడా రివీల్ చేయకపోవడం అసలు ట్విస్ట్.
ఈ లెక్కన దగ లైఫ్ లో మలుపులు చాలా ఉండబోతున్నాయేది అర్థమవుతోంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ చాలా కబుర్లు పంచుకున్నారు. సుహాసినిని పెళ్లి చేసుకోకముందే తాను మణిరత్నం నాయకుడుతో ఒక్కటయ్యామని చెప్పి నవ్వులు పూయించారు. ఇంద్రుడు చంద్రుడుకి తనికెళ్ళ భరణితో రచన చేయించాలనుకోవడం దగ్గరి నుంచి నాయకుడు కన్నా దగ్ లైఫ్ ఏ రకంగా గొప్పగా ఉంటుందనే దాకా చాలానే చెప్పుకొచ్చారు. జూన్ 5 విడుదల కాబోతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు టాప్ టెక్నీషియన్స్ రవి కె చంద్రన్ ఛాయాగ్రహణం, ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.
This post was last modified on May 23, 2025 10:40 am
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…