ఇవాళ శుక్రవారం కొత్త రిలీజులున్నా బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించడం లేదు. మే నెలలో శ్రీవిష్ణు సింగిల్ తర్వాత ఇంకే సినిమా చెప్పుకోదగ్గ సౌండ్ చేయలేకపోయింది. జగదేకవీరుడు అతిలోకసుందరి కొంత మేర వర్కౌట్ చేసుకోగా అద్భుతం చేస్తుందనుకున్న యమదొంగ పెద్దగా వసూళ్లు తేలేదు. ఈ నేపథ్యంలో ఇదే నిర్లిప్తత ఇవాళ కూడా కొనసాగేలా ఉంది. విజయ్ సేతుపతి – రుక్మిణి వసంత్ ‘ఏస్’ మీద పెద్దగా అంచనాలు లేకపోవడంతో ప్రమోషన్లు కూడా అంతంత మాత్రంగా చేయడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. మహారాజాలాగా ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తేనే ఆడియన్స్ ని థియేటర్లకు రాబట్టగలదు.
హిందీ బ్లాక్ బస్టర్ ‘కేసరి చాప్టర్ 2’ ఒరిజినల్ వెర్షన్ ఎంత హిట్టయినా తెలుగు అనువాదం చాలా ఆలస్యం చేయడంతో మన ఆడియన్స్ ఏమంత ఆసక్తి కనబరచడం లేదు. అందులోనూ పబ్లిసిటీ మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడం కలెక్షన్లను ప్రభావితం చేయనుంది. చావా తరహాలో దీని మీద టాలీవుడ్ జనాలకు ఇంటరెస్ట్ లేదనే విషయం తేటతెల్లమవుతోంది. ఇవి కాకుండా వీరరాజు, నిశ్శబ్ద ప్రేమ, వైభవం అంటూ మరికొన్ని చిన్న సినిమాలు రేస్ లో ఉన్నాయి కానీ వీటికి మార్నింగ్ షోల్లో జనాలు కనిపించినా గొప్పే. ఐపీఎల్ ప్రభావం లేకపోయినా థియేటర్ల దగ్గర నిశ్శబ్ద వాతావరణం తాండవిస్తోంది.
ట్విస్ట్ ఏంటంటే ‘వర్షం’ రీ రిలీజ్ ట్రెండింగ్ లో ఉంది. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో 15 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చూస్తే ప్రభాస్ డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షం రీ రిలీజ్ కావడం ఇది మొదటిసారి కాదు. అయినా సరే ఇంత స్పందన రావడం అనూహ్యం. కరెంట్ బుకింగ్స్ కలుపుకుంటే భారీ నెంబర్లు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. బాలీవుడ్ రిలీజులు భూల్ ఛుక్ మాఫ్, కేసరి వీర్ లకు రెస్పాన్స్ అంతంత మాత్రంగా ఉంది. మే 30 బెల్లంకొండ సాయిశ్రీనివాస్ భైరవం దాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
This post was last modified on May 23, 2025 9:38 am
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…