Movie News

దళపతి చేజారింది…దగ్ లైఫ్ దొరికింది

అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అంటూ మహాకవి ఆత్రేయ ఊరికే అనలేదు. నిన్న జరిగిన దగ్ లైఫ్ ప్రెస్ మీట్ లో తనికెళ్ళ భరణి అలాంటి సంఘటన ఒకటి పంచుకున్నారు. శివ నుంచి ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న భరణికి 1991లో దళపతి రూపంలో అవకాశం తలుపు తట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ – మణిరత్నం కాంబినేషన్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ లుక్ టెస్ట్, ఆడిషన్ చేశాక వయసు సరిపోదని భావించి భరణిని వెనక్కు పంపేశారు. దీంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. మళ్ళీ అవకాశం రాకపోదాని ఎదురు చూశారు కానీ అది దశాబ్దాల పాటు కలగానే ఉండిపోయింది.

కట్ చేస్తే ముప్పై సంవత్సరాల తర్వాత పొన్నియిన్ సెల్వన్ తెలుగు స్క్రిప్ట్ కు పని చేసే అవకాశం దొరికింది. ఇదే అదునుగా భావించిన తనికెళ్ళ భరణి తనకు తరువాతి సినిమాలో కనీసం ఒక్క షాట్లో కనిపించే ఛాన్స్ ఉన్నా ఇమ్మని అడిగారు. నవ్వి ఊరుకున్న మణిరత్నం సమాధానం ఇవ్వలేదు. తర్వాత దగ్ లైఫ్ లో క్యారెక్టర్ ఉందంటూ పిలుపు వచ్చింది. ఏదైనా ఒక్క సీన్ చాలనుకుంటే ఏకంగా మంచి నిడివి ఉన్న పాత్ర ఇచ్చారు. దీంతో సుదీర్ఘంగా కన్న కల ఈ విధంగా నిజమయ్యింది. దళపతి పేరు తనికెళ్ళ భరణి ప్రస్తావించలేదు కానీ రజని మణిరత్నం కాంబోలో వచ్చిన సినిమా అదొక్కటే కాబట్టి ఈజీగా గెస్ చేయొచ్చు.

ఈ రకంగా దగ్ లైఫ్ చాలా ప్రత్యేకతలు మోసుకొస్తోంది. జూన్ 5 విడుదల దగ్గర ఉండటంతో ప్రమోషన్ల వేగం పెంచారు. నాయకుడు కంటే గొప్పగా వచ్చిందని కమల్ హాసన్ చెబుతున్న మాటలు అంచనాలు పెంచేస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం, త్రిష అభిరామి గ్లామర్, శింబు పాత్ర, మాఫియా బ్యాక్ డ్రాప్, భారీ తారాగణం వగైరాలు ఆసక్తి రేపుతున్నాయి. విక్రమ్ తర్వాత ఇండియన్ 2 రూపంలో పెద్ద షాక్ తిన్న కమల్ ఇప్పుడీ దగ్ లైఫ్ తో కంబ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. తెలుగులో బజ్ తక్కువగా కనిపిస్తోంది కానీ రిలీజ్ నాటికి అంచనాల్లో భారీ మార్పులు వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.

This post was last modified on May 23, 2025 9:28 am

Share

Recent Posts

ఏబీవీకి మంచి మద్దతు

విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆలూరి బాల వెంక‌టే శ్వర‌రావు(ఏబీవీ)కు మాజీ…

2 hours ago

పాపం చంద్రబాబు చాలా తగ్గారు: పవన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదని వైసీపీ ప్రచారం…

3 hours ago

కంగనా రనౌత్ మళ్లీ తెలుగులో?

బాలీవుడ్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో తెలుగులో ప్రభాస్ లాంటి పెద్ద హీరో సరసన ‘ఏక్ నిరంజన్’ సినిమా చేసింది…

4 hours ago

నాగ‌వంశీ ఫ్రెండు కాదు, ప్రొడ్యూసర్ మాత్రమే

ఒక హీరో, ఒక‌ నిర్మాత క‌లిసి సినిమా చేసే క్ర‌మంలో కొన్ని నెల‌లు, సంవ‌త్స‌రాలు క‌లిసి ప్ర‌యాణం చేస్తారు. ఈ…

4 hours ago

మెగావర్స్… కొత్త అధ్యాయం ఎలా ఉంటుందో

మెగాస్టార్ చిరంజీవి మరోసారి బుల్లితెరపై మెరవబోతున్నారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు యాంకర్ గా ఒక సీజన్ నడిపించిన సంగతి…

5 hours ago

టికెట్ రేట్ల ఆదర్శం మేలు చేస్తుందంటారా

ప్యాన్ ఇండియా సినిమా కాదు. విజువల్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. రిస్క్ తీసుకుని ఫారిన్ లొకేషన్లలో షూట్ చేసిన దాఖలాలు…

5 hours ago