తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకుని, ఇక్కడ బాగా సంపాదించుకున్నాక.. బాలీవుడ్‌కు వెళ్లి ఇక్కడి సినిమాలను తక్కువ చేసి మాట్లాడ్డం బాలీవుడ్ హీరోయిన్లకు అలవాటు. గతంలో ఇలియానా, తాప్సి.. ఈ మధ్య జాన్వి కపూర్, రాధిక ఆప్టే ఇలాగే మాట్లాడి తమ నైజాన్ని చాటుకున్నారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు.
తెలుగు సినిమాల మీద తమ ప్రేమను, కృతజ్ఞతను ఎప్పటికప్పుడు చాటిచెబుతూనే ఉంటారు. కాజల్ అగర్వాల్ ఈ కోవకే చెందుతుంది. ఆమె ఎక్కడికి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చినా తెలుగు సినిమాల మీద తన అభిమానాన్ని వెల్లడిస్తూనే ఉంటుంది. తాజాగా ఒక హిందీ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ తన ‘తెలుగు’ ప్రేమను చాటింది.
తాను పక్కా పంజాబీ అమ్మాయినని.. సౌత్ ముంబయిలో పెరిగానని.. కానీ తనకు తొలి అవకాశం వచ్చింది మాత్రం తెలుగు సినిమాలో అని కాజల్ గుర్తు చేసుకుంది. ఎలాంటి మోడలింగ్ కూడా చేయకుండానే తాను ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నానని.. మదనపల్లి అనే చిన్న టౌన్లో ఆ సినిమా షూటింగ్ జరిగిందని.. ఒక్కసారిగా అలాంటి చిన్న టౌన్‌కు వెళ్లినపుడు అక్కడి మనుషులు, కల్చర్, పద్ధతులు అన్నీ తనకు చాలా కొత్తగా కనిపించాయని.. పైగా అందులో తనది గ్రామీణ అమ్మాయి పాత్ర కావడంతో మరింత కొత్తగా అనిపించిందని.. అలా మొదలైన తన ప్రయాణం తెలుగు వాళ్లతో గొప్ప అనుబంధం ఏర్పడే స్థాయికి వెళ్లిందని కాజల్ చెప్పుకొచ్చింది.
తన యవ్వనమంతా హైదరాబాద్‌తో పాటు ఏపీ, తెలంగాణ అనేక ప్రాంతాల్లోనే గడిచిందని.. ఇలా తాను ఒక తెలుగు అమ్మాయిగా మారిపోయానని కాజల్ వ్యాఖ్యానించింది.
తాను తెలుగమ్మాయిని అని చెప్పుకోవడానికి ఇష్టపడతానని.. తన పెళ్లిలో కూడా ప్రత్యేకంగా చెప్పి మరీ తెలుగు సంప్రదాయాలను పాటించినానని కాజల్ వెల్లడించడం విశేషం. ఇందుకు తన కుటుంబం, గౌతమ్ ఫ్యామిలీలో ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదని.. అన్నీ తన ఇష్టానికి వదిలేశారని ఆమె చెప్పింది. కాజల్ ఇలా తెలుగు ప్రేమ గురించి చెప్పిన మాటల పట్ల సోషల్ మీడియాలో తెలుగు వారి నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇక్కడి సినిమాలు, కల్చర్ గురించి తక్కువ చేసి మాట్లాడే వాళ్లకు ఇది చెంపపెట్టు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on November 15, 2026 6:31 am
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రకృతి మరోసారి పరీక్ష పెట్టబోతోందా? ఇప్పటికే రెండు తుఫానుల ప్రభావంతో అతలాకుతలమైన రాష్ట్రానికి ఇప్పుడు మూడో తుఫాను…
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ…
ఒక క్రేజీ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతుంటే.. దాని నిర్మాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం అరుదైన విషయం. ఏదైనా వివాదం…
ఏపీ సీఎం చంద్రబాబు.. కొత్త కాన్వాయ్‌ను సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న కాన్వాయ్ ను 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు…
పిల్లలను పెంచడం తల్లి ఒక్కరి బాధ్యత మాత్రమేనా? పిల్లలకు ఆహారం పెట్టడం, డైపర్ మార్చడం, స్నానం చేయించడం వంటి పనులు…
బాహుబలి సహా కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించి తెలుగు సినిమాలకు మేలుచేశాయో, చేటు చేశాయో తెలియని…