అజ్ఞాతవాసి తర్వాత రాజకీయ కారణాలతో గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇచ్చాక చేసిన మూడు సినిమాలు రీమేక్ కావడం కాకతాళీయమే అయినా అభిమానుల్లో కొంత అసంతృప్తిని కలిగించింది వాస్తవం. పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ కమర్షియల్ గా వర్కౌట్ అయినా పవన్ రేంజ్ కాదనేది ట్రేడ్ సైతం ఒప్పుకుంటుంది. అయ్యప్పనుం కోశియుమ్ తెలుగు రూపకం ‘భీమ్లా నాయక్’ డీసెంట్ అనిపించుకున్నా వంద కోట్ల మార్కును అందుకోలేదు. వినోదయ సితంను తీసుకొచ్చి ‘బ్రో’గా మారిస్తే ఈసారి మాత్రం దెబ్బ పడింది. యావరేజ్ అనిపించుకోవడానికి కష్టపడింది. ఇదంతా జరిగిపోయిన గతం.
వర్తమానంలో పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న నాలుగు సినిమాలు స్ట్రెయిట్ సబ్జెక్టులు కావడం పట్ల ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ‘హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ భారీ బడ్జెట్ తో పవర్ స్టార్ కెరీర్ లోనే తొలి పీరియాడిక్ మూవీగా అయిదేళ్ళు నిర్మాణం జరుపుకుని జూన్ 12 విడుదలకు రెడీ అవుతోంది. ఇక ‘ఓజి’ అంచనాల గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆకాశమే హద్దుగా హైప్, బిజినెస్ రెండూ అంతకంత పెరుగుతున్నాయి తప్పించి తగ్గడం లేదు. మొదట తేరి రీమేక్ గా ప్రచారం జరిగినప్పటికీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు హరీష్ శంకర్ పూర్తి కొత్త కథతో ట్రీట్ మెంట్ మొత్తం మార్చేశారని విశ్వసనీయ సమాచారం.
వీటి తర్వాత ‘హరిహర వీరమల్లు పార్ట్ 2’ ఉంటుంది. దీని క్యాప్షన్ ఇంకా రివీల్ చేయలేదు కానీ పార్ట్ 1 క్లైమాక్స్ లో దానికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. ఇలా మొత్తం నాలుగు స్ట్రెయిట్ సినిమాలతో పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న థియేట్రికల్ బిజినెస్ ఎంత లేదన్నా అయిదు వందల కోట్ల పైమాటేనని ట్రేడ్ వర్గాల టాక్. ఇతరత్రా హక్కులు కలుపుకుంటే ఈ మొత్తం రెట్టింపుని దాటేస్తుంది. పొలిటికల్ గా బిజీగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేస్తారో లేదోననే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నాలుగు సినిమాలు కనక ప్రేక్షకులను సంతృప్తి పరిస్తే ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతాయి.
This post was last modified on May 23, 2025 8:58 am
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్…
వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్…
2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా…
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…