Political News

రెండు కోట్లతో కొత్త కాన్వాయ్

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. కొత్త కాన్వాయ్‌ను స‌మ‌కూర్చుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఉన్న కాన్వాయ్ ను 2024లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించేందుకు వీలుగా.. మ‌రింత సౌక‌ర్యంగా ఎక్కువ మంది కూర్చునేందుకు వీలుగా ఇప్పుడు కొత్త కాన్వాయ్‌ను తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఈ మొత్తం కాన్వాయ్ ఖ‌రీదు సుమారు 2 కోట్ల రూపాయ‌లు. వాహ‌నాల ఖ‌రీదు 1.78 కోట్ల రూపాయ‌లే అయినా.. వాటికి అయ్యే ఇత‌ర ఖ‌ర్చులు క‌లుపుకొని రూ.2 కోట్లు కేటాయిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది.

ఏంటి విశేషం..
ప్ర‌స్తుతం ఉన్న కాన్వాయ్‌లో సీఎం చంద్ర‌బాబుకు భద్ర‌త బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రింత అధునాత‌న సాంకేతిక సౌక‌ర్యాల‌ను స‌మ‌కూర్చు కునేందుకు, పారిశ్రామిక వేత్త‌లు స‌హా.. మీడియా ప్ర‌తినిధుల‌తో ర‌న్నింగ్‌లోనే మాట్లాడేందుకు అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా 8 మంది కూర్చునేందుకు వీలుగా ఈ కొత్త కాన్వాయ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కాన్వాయ్‌లో ఆరు కార్లు ఉంటాయి. ఒక్కొక్క‌టి 26 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని భావిస్తున్నారు. `ఫోర్స్ ఆర్బానియా` పేరుతో పిలిచే ఈ వాహ‌నాల‌ను త్వ‌ర‌లోనే ఏపీకి అందించ‌ను న్నారు.

గ‌తంలో నిషేధం..

వాస్త‌వానికి 2024లో కొత్త కాన్వాయ్ కొనుగోలు చేసిన స‌మ‌యంలో ప్ర‌భుత్వం కోటిన్న‌ర రూపాయ‌లు వెచ్చించింది. దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో గ‌త ఏడాది ప్రారంభంలో కొత్త కార్లు కొనుగోలు చేసేందుకు.. నిషేధం విధిస్తూ.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఉన్న‌తాధికారుల నుంచి మంత్రుల వ‌ర‌కు ఎవ‌రైనా ఉన్న‌వాహ‌నాల‌నే వినియోగించాల‌ని.. కొత్త‌గా కొనుగోలు, అద్దె ప్రాతిప‌దిక‌న కూడా తీసుకునేందుకు వీల్లేద‌ని ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే.. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రికి మ‌రింత భ‌ద్ర‌త అవ‌స‌రం ఏర్ప‌డ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప‌ర్య‌ట‌న‌లు కూడా పెరుగుతున్న క్ర‌మంలో ‘ఫోర్స్ అర్బానియా 4400 WB’ మోడ‌ల్ వాహ‌నాల‌ను కొనుగోలు చేసేందుకు అనుమ‌తి ఇచ్చారు. అయితే.. ఈ కాన్వాయ్ పూర్తిగా ముఖ్య‌మంత్రికే ప‌రిమితం కానుంది. ఇత‌ర మంత్రుల‌కు ప్ర‌స్తుతం ఉన్న వాహ‌నాల‌నే వినియోగించ‌నున్నారు. 

This post was last modified on November 15, 2026 6:12 am

Share

Recent Posts

రామ్ చరణ్ పిల్లలకు ఆహారం తినిపించడం సాధారణమే

పిల్లలను పెంచడం తల్లి ఒక్కరి బాధ్యత మాత్రమేనా? పిల్లలకు ఆహారం పెట్టడం, డైపర్ మార్చడం, స్నానం చేయించడం వంటి పనులు…

1 hour ago

తార‌క్ దారి చూపించాడు.. అందరి ఫాలో అవుతారా?

బాహుబ‌లి స‌హా కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఘ‌న‌విజ‌యం సాధించి తెలుగు సినిమాలకు మేలుచేశాయో, చేటు చేశాయో తెలియ‌ని…

2 hours ago

న‌ట‌రాజ‌న్ స్థానంలో సందీప్‌. ఎవ‌రీయ‌న‌… స్పెష‌ల్ ఏంటి?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్ నియ‌మితుల‌య్యారు. తాజాగా హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆ పార్టీ అగ్ర‌నేత‌…

2 hours ago

డిజిటలీక‌ర‌ణ అవినీతిని అంతం చేస్తుందా?

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే పూర్తిస్థాయిలో డిజిట‌ల్ పాల‌న‌ను అందించేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా పాల‌న విష‌యాల్లో చాలా…

2 hours ago

పార్టీలో అసమ్మతి పెరుగుతోంది జగన్!!

స్థానిక ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌ర్వాత‌.. వైసీపీలో మ‌రింత‌గా స‌హాయ నిరాక‌ర‌ణ పెరిగిందా? నాయ‌కుల తీరు మారుతోందా? అంటే.. ఔననే స‌మాధాన‌మే…

4 hours ago

కోటి రూపాయ‌లు ప‌లికిన `స‌ర్పంచ్` ప‌ద‌వి!

ఏపీలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. మూడు విడ‌త‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.…

6 hours ago