పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్. మళ్లీ వీరి కలయికలో సినిమా అనౌన్స్ కావడానికి చాలా ఏళ్లు పట్టింది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత అనౌన్స్ అయిన సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి కూడా తక్కువ సమయం ఏమీ పట్టలేదు. అలా షూట్ ఆరంభమయ్యాక మళ్లీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు బ్రేక్ పడింది.
ఎట్టకేలకు జూన్‌లో ఈ సినిమా తిరిగి సెట్స్ మీదికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ రోజు చిత్ర బృందం కూడా ధ్రువీకరించింది. ఒక ఆసక్తికర పోస్టర్‌తో త్వరలో షూటింగ్ పున:ప్రారంభం కానున్న విషయాన్ని ప్రకటించారు. ఐతే ఈ పోస్టర్‌లో అందరినీ ఒక విషయం ఆకర్షించింది. టైటిల్ కింద ‘కథ-మాటలు-దర్శకత్వం’ అని హరీష్ శంకర్ పేరు వేసుకున్నాడు. ఇక్కడే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్ట్రెయిట్ మూవీ కాదన్నది స్పష్టం. తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’ ఆధారంగా దీన్ని పునర్నిర్మిస్తున్నారు. ఈ విషయం రహస్యమేమీ కాదు. కాకపోతే హరీష్ శంకర్ రీమేక్‌ను రీమేక్‌లా తీయడు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్.. ఇలా అన్నీ మారుస్తాడు. ఎంత మార్చినా కూడా కథ విషయంలో ఒరిజినల్ రైటర్‌కే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ‘గబ్బర్ సింగ్’కు ఎంత మార్పులు చేసినా కూడా కథకుడిగా ఒరిజినల్ రైటర్‌కే క్రెడిట్ ఇచ్చారు. మాటలు, మార్పులు దర్శకత్వం అని కొత్త రకం క్రెడిట్ వేసుకున్నాడు హరీష్.
కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు మాత్రం కథ క్రెడిట్ తనే తీసుకున్నాడు. అంటే ఇది ‘తెరి’ రీమేక్ కాదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఐతే ఈసారి మార్పులు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ‘మూల కథ’ అని అట్లీకి క్రెడిట్ ఇచ్చి.. కథకుడిగా తన పేరు వేసుకుని ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే క్రెడిట్ సీనియర్ దర్శకుడు దశరథ్ తీసుకోబోతుండడం విశేషం.
This post was last modified on May 22, 2025 9:15 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…