విడుదల తేదీ విషయంలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పరస్పరం బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశాలున్నాయని డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో మొదలైన ప్రచారం అభిమానుల్లో చర్చకు దారి తీస్తోంది. వివరాల్లోకి వెళ్తే అఖండ 2 తాండవంని సెప్టెంబర్ 25 రిలీజని షూటింగ్ ప్రారంభంలోనే ప్రకటించుకున్నారు. అయితే అప్పటికంతా షూట్ అవ్వకపోవచ్చని, 2026 సంక్రాంతికి రావొచ్చనే ప్రచారం మధ్యలో జరిగింది. కానీ దర్శకుడు బోయపాటి శీను జెట్ స్పీడ్ తో చిత్రీకరణ జరుపుతూ. క్లైమాక్స్ తో సహా కీలక భాగాలన్నీ జార్జియాలో జరుగుతున్న షెడ్యూల్ లో పూర్తి చేస్తారని తెలిసింది. తర్వాత పాటల సంగతి చూస్తారు.
సో దసరా పండక్కు వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఇంకో వైపు ఓజిని సెప్టెంబర్ 26 తీసుకొస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన నిర్మాత డివివి దానయ్య బయ్యర్ల దగ్గర ఉంచారట. తొలుత సెప్టెంబర్ 5 అనుకున్నప్పటికీ అది హాలిడే సీజన్ కాదు కాబట్టి ఫెస్టివల్ హాలిడేస్ కలిసొచ్చే 26నే సీరియస్ గా పరిశీలిస్తున్నారట. అయితే అఖండ 2 రాకపోతేనే ఇది లాక్ చేయొచ్చు. ఎందుకంటే రాజకీయంగా, వ్యక్తిగతంగా పవన్, బాలయ్యల మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ థియేటర్లలో కలబడి ఒకరి ఓపెనింగ్స్ మరొకరు దెబ్బ పడాలని కోరుకోరు. సో మధ్యస్థంగా వేరే పరిష్కారం చూడాల్సి రావొచ్చు.
సో క్లాష్ ఉండకపోవచ్చనేది ఒక వెర్షన్. అయితే రెండు సినిమాల షూటింగులు ఇంకా కీలక దశలోనే ఉన్న నేపథ్యంలో ఇప్పుడప్పుడే దీని గురించి ఎలాంటి నిర్ధారణకు రాలేం. కెరీర్ పరంగా పవన్ కు ఓజి, బాలయ్యకు అఖండ 2 చాలా ప్రెస్టీజియస్ గా రూపొందుతున్నాయి. వీటికి తమనే సంగీత దర్శకుడు కావడం కాకతాళీయం. ఒకవేళ వీటిలో ఏది దసరా మిస్ చేసుకున్నా అటుపై డిసెంబర్ లేదా జనవరికి వెళ్లాల్సి ఉంటుంది. ఎంత ప్లాన్డ్ గా ఉంటున్నా సరే రిలీజ్ డేట్లను లక్ష్యంగా పెట్టుకుని అన్నీ పూర్తి చేసుకోవడం ప్యాన్ ఇండియా దర్శకులకు సవాల్ గా మారుతోంది. అందుకే ఈ మార్పులు, డిస్కషన్లు.
This post was last modified on May 22, 2025 12:32 pm
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…