ప్రభాస్ కెరీర్ లో ఎక్కువ విమర్శలు, క్రిటిసిజం ఎదురుకున్న సినిమాగా ఆదిపురుష్ గురించి మాట్లాడితే చాలు ఫ్యాన్స్ కి కోపం వచ్చేస్తుంది. రామాయణ గాధని దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన తీరు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనే తరహాలో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. మొన్నీ మధ్య ఒక ఈవెంట్ లో ఆదిపురుష్ తెలుగు బిజినెస్ భారీ జరిగి ఎక్కువ శాతం ప్రేక్షకులు చూశారనే స్థాయిలో ఓం రౌత్ కవరింగ్ ఇచ్చుకోవడం మరిన్ని కామెంట్స్ కి చోటిచ్చింది. రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఏనాడూ మాట్లాడలేనంత వీక్ గా కంటెంట్ నిరాశపరిచిందంటే ఏ స్థాయి డిజాస్టరో చెప్పాలా.
ఇదంతా గతం. ఇప్పుడు వర్తమానానికి వద్దాం. ఓం రౌత్ మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాం బయోపిక్ తెరకెక్కించే అదృష్టాన్ని దక్కించుకున్నాడు. టి సిరీస్, ఏకె ఎంటర్ టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ లాంటి భారీ నిర్మాణ సంస్థలు ఈ ప్యాన్ ఇండియా మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్నింటి కన్నా ప్రధాన ఆకర్షణ టైటిల్ రోల్ ధనుష్ పోషించనుండటం. ఇంకెవరో అయితే టెన్షన్ పడాల్సి వచ్చేదేమో కానీ ధనుష్ అంటే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఆశించవచ్చు. ఇవాళ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఫస్ట్ లుక్ కాదు కానీ ప్రీ లుక్ అయితే వచ్చేసింది.
మూవీ లవర్స్ ఓం రౌత్ ని ఒకటే కోరుకుంటున్నారు. ఆదిపురుష్ లాగా కాకుండా కలాంని అద్భుతంగా తీయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక మహనీయుడు, గొప్ప శాస్త్రవేత్త కథ కాబట్టి పది తరాలు గర్వంగా చెప్పుకునేలా ఉండాలని అడుగుతున్నారు. వాళ్ళ కోరిక సబబే. ఎందుకంటే అబ్దుల్ కలాం జీవితంలో ఎంతో స్ఫూర్తి ఉంది. గొప్ప పాఠాలు, యువత నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలున్నాయి. వాటిని అర్ధమయ్యే రీతిలో వక్రీకరించకుండా చెబితే మాస్టర్ పీసవుతుంది. ఓం రౌత్ ఇంతకు ముందు తీసిన తానాజీలో నిజాయితీని కలాం బయోపిక్ విషయంలోనూ చూపిస్తే చాలు. కంటెంట్ ప్లస్ కమర్షియల్ రెండిట్లోనూ వర్కౌటవుతుంది.
This post was last modified on May 21, 2025 9:53 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…