తెలుగులో ఉప్పెన, విడుదలతో మనకూ దగ్గరైన విజయ్ సేతుపతి కొత్త సినిమా ఏస్ ఎల్లుండి విడుదల కానుంది. కానీ కనీస స్థాయిలో బజ్ లేకపోవడం బయ్యర్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే మహారాజా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ అంటే ఎంత లేదన్నా ఓ మాదిరి అంచనాలుంటాయి. కానీ దానికి భిన్నంగా ఏస్ చాలా సైలెంట్ గా వస్తోంది. సప్తసాగరాలు దాటి సైడ్ ఏబి హీరోయిన్, జూనియర్ ఎన్టీఆర్ సరసన డ్రాగన్ చేస్తున్న రుక్మిణి వసంత్ హీరోయిన్ కావడం ఎలాంటి ప్లస్ కాలేకపోతోంది. ఆర్ముగ కుమార్ దర్శకత్వంలో ఆయనే స్వంతంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ట్రైలర్ కంటెంట్ చూస్తే ఆసక్తికరంగానే అనిపించింది. బోల్ట్ కాశి అనే వ్యక్తి జీవితంలో చాలా పెద్ద గతం ఉంటుంది. అదేంటో తెలుసుకోవడానికి చుట్టుపక్కల వాళ్ళు ఎంత ప్రయత్నించినా సాధ్యపడదు. అయితే కాశి ఒక పెద్ద ప్లాన్ తో ఉంటాడు. దేశవిదేశాలు తిరిగి దాన్ని నెరవేర్చుకునే క్రమంలో జూదం ఆడే మాఫియా ప్రపంచంలో అడుగు పెడతాడు. ఈ పాయింట్ మీద ఏస్ నడుస్తుంది. బ్యాక్ డ్రాప్ సీరియస్ గా అనిపిస్తున్నా యోగిబాబుతో కావాల్సిన ఫన్ చేయించడంతో పాటు యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే జొప్పించినట్టు అనిపిస్తోంది. డియర్ కామ్రేడ్ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు.
ఏస్ కు బాక్సాఫీస్ దగ్గర పోటీలేని వాతావరణం కలిసి వచ్చేలా ఉంది. కాకపోతే హైప్ ఇంత తక్కువగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ తేవడం అనుమానంగానే ఉంది. మహారాజా లాగా యునానిమాస్ టాక్ వస్తే మెల్లగా పికప్ కావొచ్చు. మే 30 భైరవం వచ్చే దాకా ఎలాంటి కాంపిటీషన్ లేదు కాబట్టి వసూళ్లు రాబట్టుకోవచ్చు. శ్రీవిష్ణు సింగిల్ మూడో వారంలో అడుగుపెడుతూ ఇప్పటికే నెమ్మదించేసింది. ఇతర సినిమాల ప్రభావం సున్నానే. సో ఏస్ ఈ ఛాన్స్ ఎంత మేరకు వాడుకుంటుందో చూడాలి. ప్రమోషన్లు సరిగా చేయకపోవడం ప్రభావం చూపిస్తోంది. విజయ్ సేతుపతి కొత్తగా ట్రై చేసిన ఏస్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on May 21, 2025 8:45 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…