నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘వార్-2’ టీజర్. దీనికి సందర్భం.. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. కానీ టీజర్ చూశాక తారక్ ఫ్యాన్స్‌లో అనుకున్నంత ఉత్సాహం కనిపించలేదు. టీజర్లో తారక్ ఆశించినంతగా హైలైట్ కాలేదు. ఇది బేసిగ్గా హిందీ సినిమా కావడం, హృతిక్ మెయిన్ లీడ్‌గా నటించడంతో అతణ్నే హైలైట్ చేస్తూ షాట్స్ పెట్టారు టీజర్లో. తారక్ కూడా తన ఉనికిని చాటుకున్నప్పటికీ అభిమానులైతే ఇంకా ఎక్కువ ఆశించారు.
ఐతే విశేషం ఏంటంటే.. నిమిషంన్నర నిడివి ఉన్న టీజర్లో హృతిక్, తారక్‌లకు దాదాపుగా ఒకే స్క్రీన్ టైం ఉండగా.. వారితో పోలిస్తే నామమాత్రంగా రెండు మూడు సెకన్లు మాత్రమే కనిపించిన హీరోయిన్ కియారా అద్వానీ ఎక్కువ హైలైట్ అయిపోయింది. కెరీర్లో తొలిసారిగా స్క్రీన్ మీద టూపీస్ బికినీలో కనిపించిన కియారా.. మామూలు హాట్‌గా లేదు. ఆమె ఎంత ఆకర్షణీయంగా ఉందంటే.. ఆ రెండు మూడు క్షణాల క్లిప్‌ను స్లోమోషన్, 4కే క్లారిటీలోకి మార్చుకుని ఆ క్లిప్స్‌ను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. కియారా ఇంత హాట్‌గా, సెక్సీగా మరే సినిమాలోనూ లేదని కామెంట్లు చేస్తున్నారు.
ముందు తారక్, హృతిక్‌ల గురించే ఎక్కువ మాట్లాడిన నెటిజన్లు క్రమంగా కియారా వైపు మళ్లిపోయారు. ఆమె పేరు సోషల్ మీడియాలో అంతగా ట్రెండ్ అయింది. ఐతే టీజర్లో చూపించింది కియారా ఒరిజినల్ లుక్కేనా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇందులో కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ టచ్ ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ కొందరు అదంతా ఒరిజినలే అని వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ‘వార్-2’లో కియారా గ్లామర్ ట్రీట్ ఒక రేంజిలో ఉంటుందనే సంకేతాలు మాత్రం టీజర్ ఇచ్చింది. వార్-2 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 21, 2025 2:56 pm
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…