Movie News

స్టార్ సినిమాను తొక్కేసిన చిన్నసినిమా

సూర్య.. తమిళంలో టాప్ స్టార్లలో ఒకడు. కార్తీక్ సుబ్బరాజ్‌కు దర్శకుడిగా మంచి స్థాయే ఉంది. పూజా హెగ్డే, జోజు జార్జ్, నాజర్.. ఇలా పెద్ద కాస్టింగ్‌ తోడై భారీ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం.. రెట్రో. చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు ఇది పెద్ద బ్రేక్ ఇస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి విడుదలకు ముందు. రిలీజ్ రోజు ఈ సినిమాను తమిళ మీడియా, సూర్య ఫ్యాన్స్ ఆకాశానెత్తేశారు. కల్ట్ మూవీగా ప్రచారం చేశారు.

కానీ తెలుగు ప్రేక్షకులు ‘రెట్రో’ సినిమా చూసి తలలు పట్టుకున్నారు. అసలు ఈ సినిమా కథేంటో.. హీరో పాత్రేంటో అర్థం కాక.. ఏమాత్రం ఎంగేజ్ చేయని సన్నివేశాలతో విసుగెత్తిపోయి థియేటర్ల నుంచి బయటికి వచ్చారు. కానీ తమిళ జనాలు మాత్రం ఈ సినిమా గురించి తొలి వీకెండ్లో ఎలివేషన్లు ఇచ్చుకుంటూనే సాగిపోయారు. కానీ తీరా చూస్తే ఈ చిత్రం తమిళనాట కూడా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. తెలుగులో తొలి రోజే డిజాస్టర్ అని తేలిపోయింది. తమిళంలో ఓ వారం రోజులు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘రెట్రో’ తర్వాత చల్లబడిపోయింది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే చిన్న సినిమా.. సూర్య మూవీకి చెక్ పెట్టింది.

దర్శకుడు శశికుమార్, సీనియర్ నటి సిమ్రన్ ముఖ్య పాత్రలు పోషించిన సినిమా ఇది. స్టార్లు లేకపోయినా కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అభిషన్ అనే కొత్త దర్శకుడు చాలా హృద్యంగా ఈ సినిమాను తీసి ప్రేక్షకులను మెప్పించాడు. విడుదలకు ముందు ప్రెస్ ప్రివ్యూల నుంచే చాలా మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి.. తర్వాత మౌత్ టాక్ కూడా తోడవడంతో క్రమంగా వసూళ్లు పెంచుకుంటూ సాగింది. తొలి రోజు రెండున్నర కోట్లతో మొదలైన సినిమా ఇప్పుడు రూ.60 కోట్ల మార్కును దాటేసింది. తమిళనాడులో.. ‘రెట్రో’ కంటే ఈ సినిమా వసూళ్లే ఎక్కువ కావడం విశేషం. ఇటీవల సక్సెస్ మీట్లో చిత్ర బృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడం విశేషం.

This post was last modified on May 19, 2025 12:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

9 minutes ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

12 minutes ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

33 minutes ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

3 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

5 hours ago