థగ్ లైఫ్.. కమల్ హాసన్-మణిరత్నంల లెజెండరీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం. ‘నాయకుడు’ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ నుంచి ఇన్నేళ్ల తర్వాత వస్తున్న సినిమా అయినా సరే.. దీనికి కొన్ని రోజుల ముందు వరకు పెద్దగా హైప్ లేదు. కమల్ సినిమాలు బాగా తగ్గించేయడం.. మణిరత్నం ఫామ్‌లో లేకపోవడం.. సినిమాను సరిగా ప్రమోట్ చేయకపోవడం వల్ల బజ్ క్రియేట్ కాలేదు. తమిళంలో అయినా పర్వాలేదు కానీ.. తెలుగులో ఈ సినిమా పట్ల ఆసక్తి అంతంతమాత్రంగానే కనిపించింది.
కానీ నిన్న పెద్ద అంచనాలు లేకుండా విడుదలైన ‘థగ్ లైఫ్’ ట్రైలర్ మొత్తం కథను మార్చేసింది. ఇప్పటిదాకా ఈ సినిమా కథేంటో చిన్న ఐడియా కూడా లేని ప్రేక్షకులకు.. అనేక సర్ప్రైజింగ్ అంశాలతో మంచి ట్రీట్ ఇవ్వబోతున్న సంకేతాలు ఇచ్చింది మణిరత్నం టీం. కమల్ హాసన్-శింబుల ఫేసాఫే సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచేలా ఉంది. జోజు జార్జ్, నాజర్ లాంటి మేటి నటుల పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా అనిపించాయి. మన ప్రేక్షకులకు పరిచయమున్న గ్యాంగ్‌స్టర్ డ్రామాకే మణిరత్నం తన మార్కు ట్రీట్మెంట్ ఇచ్చినట్లున్నాడు. ట్రైలర్లో ప్రతి షాట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది.
అన్నింటికీ మించి కమల్ హాసన్.. అభిరామి, త్రిషలతో చేసిన రొమాన్స్ ట్రైలర్ వైరల్ కావడానికి దోహదం చేసింది. దీని గురించి సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. వీటి మీద వస్తున్న నెగెటివ్ కామెంట్లు కూడా సినిమా ప్రచారానికి బాగానే ఉపయోగపడుతున్నాయి. చాలా ఏళ్ల నుంచి జనరంజకమైన సినిమాలు తీయట్లేదని విమర్శలు ఎదుర్కొంటున్న మణిరత్నం.. ఈ చిత్రంతో పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంటాడనే అంచనాలు ఏర్పడుతున్నాయి. వేసవిలో సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో వస్తున్న చిత్రం కావడంతో అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి.
This post was last modified on May 19, 2025 12:07 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…