ప్రభాస్ సినిమా అంటే యాక్షన్ మోత మోగిపోవాల్సిందే. మొదట్నుంచి అతను యాక్షన్ ప్రధానమైన సినిమాలే చేస్తూ వస్తున్నాడు. బాహుబలితో తిరుగులేని మాస్ హీరోగా ఎదిగాక ప్రభాస్ నుంచి యాక్షన్ మోతాదు మరింత ఆశిస్తున్నారు ప్రేక్షకులు. సాహోను ప్రేక్షకుల కోరుకున్నట్లే పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా మలచగా.. కథాకథనాల్లో లోపాల వల్ల ఆ సినిమా ఆడలేదు.
ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సంగతి చూస్తే పూర్తి క్లాస్‌గా కనిపిస్తోంది. ముందు నుంచి ఇది పూర్తి స్థాయి ప్రేమకథ అనే సంకేతాలే ఇస్తోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో ఇందులో యాక్షన్ సంగతేంటి అన్న సందేహాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఐతే వారికి ఈ విషయంలో మరింత స్పష్టత ఇచ్చేశాడు ప్రభాస్.
కరోనా అనంతరం రాధేశ్యామ్ చిత్రీకరణ ఇటలీలో సాగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడి మీడియా ప్రభాస్‌ను ఇంటర్వ్యూలు చేయడం విశేషం. ఆ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రాధేశ్యామ్ జానర్ గురించి ప్రభాస్ మాట్లాడాడు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ అని చెప్పాడు. సినిమాలో ఒకే ఒక్క యాక్షన్ బ్లాక్ ఉందని కూడా అతను వెల్లడించాడు. అది మినహాయిస్తే సినిమా అంతా ప్రేమ కథ చుట్టూనే నడుస్తుందన్నాడు.
దీన్ని బట్టి సినిమాలో భావోద్వేగాలు ప్రధానం తప్ప హీరో ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలకు పెద్దగా అవకాశం లేదని స్పష్టమవుతోంది. అభిమానులు నిరాశ చెందకుండా వాళ్లను ముందు నుంచే ప్రభాస్ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా టీజర్, ట్రైలర్ వచ్చాక ఈ విషయంలో మరింత స్పష్టత రావచ్చు. రాధాకృష్ణకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవికి విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on November 7, 2020 8:52 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…