భాష ఏదైనా సరే ఆ ఇండస్ట్రీ టాప్ స్టార్లలో ఒకడైన హీరో సినిమా షూటింగ్ అంటే ఉండే హంగామానే వేరుగా ఉంటుంది. పెద్ద ఎత్తున కాస్ట్ అండ్ క్రూ ఇన్వాల్వ్ అవుతుంది. లొకేషన్లు, సెట్లు, ఇతర ప్రాపర్టీస్ అంతా కూడా ఒక రేంజిలో ఉంటుంది. జూనియర్ ఆర్టిస్టుల హంగామాకూ కొదవుండదు. ఇంతమందితో డీల్ చేస్తూ చిత్రీకరణ సాగించాలంటే మామూలు విషయం కాదు.
కథ పరంగా కూడా భారీతనం ఉంటుంది కాబట్టి వర్కింగ్ డేస్ చాలా అవుతాయి. ఎంత వేగంగా చేసినా మూణ్నాలుగు నెలల పాటు చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది. అలాంటిది మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను హీరోగా పెట్టి కరోనా షరతుల మధ్య షూటింగ్ చేస్తూ కేవలం 40 రోజుల్లో ఒక సినిమాను పూర్తి చేశారంటే షాకవ్వాల్సిందే.
ఏడేళ్ల కిందట వచ్చిన మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ దృశ్యంకు సీక్వెల్‌గా దృశ్యం-2ను సెప్టెంబరు 25న ఆరంభించింది చిత్ర బృందం. మధ్యలో ఎన్ని రోజులు విరామం తీసుకున్నారో ఏమో కానీ.. నవంబరు 6వ తారీఖున టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసింది దృశ్యం టీం. కరోనా టైంలో ఒక పెద్ద స్టార్ సినిమా ఇంత వేగంగా పూర్తి కావడం అనూహ్యం. వివిధ భాషలకు చెందిన స్టార్లందరూ మోహన్ లాల్ అండ్ టీంను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.
దృశ్యంతో సంచలనం సృష్టించిన యే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. లాల్‌కు జోడీగా ఇందులోనూ మీనానే భార్య పాత్ర పోషించింది. దృశ్యంలో చేసిన చిన్నమ్మాయి ఇందులోనూ నటించింది. పెద్దమ్మాయి పాత్రను వేరే నటి పోషించింది. మరి మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయి దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో రీమేక్ అక్కడా సంచలనం రేపిన దృశ్యంకు కొనసాగింపుగా వస్తున్న సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
This post was last modified on November 7, 2020 8:50 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…