Movie News

తారక్ పుట్టినరోజు వైపు బాలీవుడ్ చూపు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. సంబరాలకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. యమదొంగ రీ రిలీజ్ తో పాటు కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి బాలీవుడ్ చూపు తారక్ బర్త్ డే మీద ఉంది. కారణం వార్ 2. ఇప్పటిదాకా ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ప్రమోషన్ జరగలేదు. వీడియో మాట దేవుడెరుగు కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ ఎలా ఉంటాయనే క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో వార్ 2 బృందం మొదటి పబ్లిసిటీ కంటెంట్ ని వదలబోతోంది. అందుకే అందరి దృష్టి దీని మీదే ఉంది.

ప్రత్యేకంగా బాలీవుడ్ గురించి ప్రస్తావించడానికి కారణముంది. యానిమల్, జవాన్, పఠాన్, చావా తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అయిదు వందల కోట్ల వసూళ్లు దాటించిన సినిమా హిందీలో రాలేదు. అందులోనూ ఈ ఏడాదిలో ఒకటి రెండు తప్ప బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ అయిన బాలీవుడ్ మూవీస్ లేవు. కనీసం రెండు మూడు వారాలు థియేటర్లు కిక్కిరిసిపోయేలా చేసిన సినిమా కనీసం నెలకొకటి రాకపోవడం ట్రేడ్ మీద ప్రభావం చూపిస్తోంది. అందుకే వార్ 2 మీద ఈ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. టీజర్ వస్తుందా పోస్టర్ వదులుతారా క్లారిటీ ఇంకా లేదు కానీ ఏదో ఒకటి సెన్సేషనవ్వాలనేది ఫ్యాన్స్ కోరిక.

ఒకవైపు ఆగస్ట్ 14నే వార్ 2కి పోటీగా వస్తున్న కూలి ప్రమోషన్లు ఊపందుకున్నాయి. చిన్న చిన్న వీడియోలతోనే దర్శకుడు లోకేష్ కనగరాజ్ పెంచుతున్న బజ్ అంతా ఇంతా కాదు. ఉదాహరణకు వెనుక నుంచి వదిలిన నాగార్జున బ్యాక్ షాట్ సోషల్ మీడియాని రెండు రోజులు ఊపేసింది. ఒక పాట ప్రోమో వదిలారు. అందరి లుక్స్ కి సంబంధించిన పోస్టర్స్ వచ్చేశాయి. ట్రైలర్ కూడా త్వరలోనే రానుంది. ఇలా పోల్చుకుంటే మార్కెటింగ్ ప్లాన్ లో వార్ 2 వెనుకబడిన మాట వాస్తవం. దానికి చెక్ పెట్టేలా మే 20 వచ్చేది ఏదైనా సింప్లి సూపర్బ్ అనిపించుకోవాలి. దర్శకుడు అయాన్ ముఖర్జీ అలాంటిదే ఇస్తాడని అభిమానుల నమ్మకం.

This post was last modified on May 16, 2025 12:09 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

4 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

5 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

6 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago