Movie News

సినీ పితామహుడుగా జూనియర్ ఎన్టీఆర్ ?

ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఒక షాకింగ్ బయోపిక్ చేసే అవకాశాలున్నాయంటూ ముంబై మీడియాలో వస్తున్న కథనాలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. వాటి ప్రకారం సినీ పితామహుడిగా పరిశ్రమగా కొనియాడే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించేందుకు తారక్ సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు వెనుక రాజమౌళి, కార్తికేయ, వరుణ్ గుప్తా (మ్యాక్స్ స్టూడియోస్) ప్రమేయం ఉందని అందులో పొందుపరిచారు. స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, వినగానే జూనియర్ ఎగ్జైట్ అయిపోయి అంగీకారం తెలిపాడని పేర్కొన్నారు.

అసలు దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఎంత గొప్పదైనా ఆయన జీవితంలోని డ్రామాని తారక్ లాంటి ప్యాన్ ఇండియా కమర్షియల్ స్టార్ తో వర్కౌట్ చేయించడం కష్టం. ఎందుకంటే మాస్ అంత సులభంగా కనెక్ట్ కారు. 1870 లో పుట్టిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతదేశపు మొదటి సినిమా రాజా హరిశ్చంద్రకు నిర్మాత కం దర్శకులు. ఇది 1913లో రిలీజయ్యింది. మొత్తం 95 ఫీచర్ ఫిలింస్ తీసిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. 1903లో ఆర్కియాలాజి డిపార్ట్ మెంట్ లో ఫోటోగ్రాఫర్ గా చేరాక ఫాల్కే జీవితం మలుపు తిరిగింది. 1910లో లైఫ్ అఫ్ క్రీస్ట్ చిత్రం చూశాక తాను సినిమా తీయాలని నిర్ణయించుకోవడం దేశ తలరాతను మార్చింది.

మొత్తం ఆస్తులు అమ్మి డబ్బులు పోగేసి సినిమా తీయడానికి అవసరమైన పరికరాలు పుస్తకాలు కొనేవారు. లండన్ వెళ్లి అయిదు పౌండ్లతో కెమెరా కొనుక్కుని వచ్చి ఒక షార్ట్ ఫిలిం తీసి స్నేహితుల దగ్గర తీసుకున్నది, తాకట్టు రూపంలో పోగేసింది మొత్తం కలిసి పది వేల రూపాయలతో నిర్మాత, దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. నగలు అమ్మి డబ్బు ఇచ్చిన భార్య సరస్వతి బాయ్ ప్రోత్సాహం చాలా ఉంది. ఇంత గొప్ప మనిషి జీవితం చివరి దశలో డబ్బు లేకుండా గడిచిపోయింది. చనిపోవడానికి ఆరు సంవత్సరాల ముందు వరకు ఆయనకు స్వంత ఇల్లు లేదు. అదే ఇంట్లో అనారోగ్యంతో కన్ను మూశారు.

ఇక్కడ క్లుప్తంగా చెప్పడం జరిగింది కానీ దాదాసాహెబ్ ఫాల్కే జీవితం చాలా పెద్దది. మరి ఇలాంటి కంటెంట్ ఖచ్చితంగా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం చాలా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సూటవుతాడు కూడా. మరి నిజంగా కార్యరూపం దాలిస్తే ప్రపంచ సినిమా గొప్పగా చెప్పుకునే క్లాసిక్ అవుతుంది. బాక్సాఫీస్ పరంగా అద్భుతాలు చేసినా చేయకపోయినా ఒక మహనీయుడి జీవితం శాశ్వతత్వం సంపాదించుకుంటుంది. అన్నట్టు సీనియర్ నరేష్ కొన్నేళ్ల క్రితం రఘుపతి వెంకయ్యనాయుడు బయోపిక్ చేశారు కానీ ఆడలేదు. కానీ తారక్ దాదాసాహెబ్ ఫాల్కే చేస్తే స్కేల్ మారిపోతుంది కాబట్టి నిజమవ్వాలనే ప్రతి మూవీ లవర్ ప్రఘాడ కోరిక.

This post was last modified on May 15, 2025 5:17 am

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago