ప్రభాస్ ఉండగా దీపికకు అంత రెమ్యునరేషనా

కల్కి 2898 ఏడిలో హీరోయిన్ గా కనిపించేది ఎక్కువసేపు కాకపోయినా ప్రాధాన్యం దక్కించుకున్న దీపికా పదుకునే రెండో భాగంలో ఉంటుందో లేదో కానీ స్పిరిట్ లో భాగమయ్యిందనే వార్త కొద్దిరోజులుగా ముంబై వర్గాల్లో గట్టిగా తిరుగుతోంది. అంతే కాదు స్పిరిట్ కోసం ఆమెకు ఏకంగా ఇరవై కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ప్రభాస్ సరసన ఎవరు నటించినా పెద్దగా ఫరక్ పడదు. డార్లింగ్ ప్యాన్ ఇండియా కటవుట్ ముందు ఎవరైనా ఓకే అనిపిస్తారు. సలార్ లో శృతి హాసన్ ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. సాహోలో శ్రద్ధ కపూర్ ఎంతమందికి గుర్తుందంటే చెప్పడం కష్టం.

అలాంటప్పుడు దీపికాకు అంత ఇవ్వడం అవసరమా అనే చర్చ రాకపోదు. స్పిరిట్ తెలుగు సినిమాగా ప్రమోట్ చేయడం లేదు. టి సిరీస్ సంస్థ బాలీవుడ్ మూవీగానే మార్కెట్ చేసే ప్లాన్ లో ఉంది. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ తో పాటు క్యాస్టింగ్ లో వీలైనంత హిందీ వాళ్ళు ఉండేలా చూసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున మార్కెట్ ని లక్ష్యంగా పెట్టుకోవాలనే ప్రణాళికతో ఉందట. ఆ కారణంగానే దీపికా అంత పెద్ద మొత్తం అడిగినా ఓకే అన్నారనే కోణంలో కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్లు రాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇక స్పిరిట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ ప్రభాస్ వచ్చాక డిసైడ్ అవుతుంది. ఈ వారంలోనే విదేశాల నుంచి వచ్చేస్తున్న డార్లింగ్ రాగానే ముందు ది రాజా సాబ్ టీజర్ కు డబ్బింగ్ చెప్పాలి. ఆ తర్వాత పాటల చిత్రీకరణలో పాల్గొనాలి. ఫౌజీ బ్యాలన్స్ కోసం డేట్లు కేటాయించాలి. ఆపై స్పిరిట్ గురించి ఒక నిర్ధారణకు రావాలి. వెయిటింగ్ లిస్టులో ప్రశాంత్ వర్మ, సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం, కల్కి 2 ఉన్నాయి. ఇవి కాకుండా మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు కథలు ఫైనల్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారట. చూస్తుంటే వచ్చే నెల నుంచి క్రేజీ అప్డేట్స్ ప్రభాస్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉన్నాయి.