ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో భారీ క్యాస్టింగ్ లేకుండా తీసిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు ప్రేక్షకులు థియేటర్లలో మంచి ఆదరణ అందించారు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక ప్యాన్ ఇండియా మూవీ చావాకు పోటీ ఇచ్చే స్థాయిలో ఆడియన్స్ ప్రేమను సొంతం చేసుకోవడం మాములు విషయం కాదు. దర్శకుడు రామ్ జగదీశ్ తీసుకున్న కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేసిన తీరు, న్యాయస్థానంలో జరిగే అన్యాయాన్ని విసిగించకుండా చెప్పిన విధానం ఇతర బాషల స్టార్లను సైతం మెప్పించి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించేలా చేసింది.
ఇప్పుడు రామ్ జగదీశ్ రెండో సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. నానినే రెండో మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మేరకు కోర్ట్ షూటింగ్ టైంలోనే అగ్రిమెంట్ చేసుకున్నారట. నాని ఇలా కమిట్ కావడం అరుదు. శైలేష్ కొలను తర్వాత రామ్ జగదీశ్ కే ఇలాంటి ఆఫర్ దక్కింది. దుల్కర్ సల్మాన్ హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక స్టోరీ సిద్ధమైనట్టు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు కానీ ప్రాధమికంగా జరిగిన చర్చల్లో దాదాపుగా అంగీకారం జరిగినట్టు వినికిడి. ఫైనల్ స్క్రిప్ట్ లాకయ్యాక అధికారిక ప్రకటన ఇచ్చే సూచనలున్నాయి.
రెండో సినిమాకే ఇంత ప్రమోషన్ అందుకున్న రామ్ జగదీశ్ దీన్ని సరిగ్గా వాడుకుంటే టాప్ లీగ్ లోకి చేరిపోవచ్చు. ఎందుకంటే నాన్ కమర్షియల్ కంటెంట్ తోనే అంత పెద్ద హిట్టు కొట్టినప్పుడు బడ్జెట్, స్టార్ దొరికితే ఇంకే స్థాయిలో వాడుకోవాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్ణయం ఇంకో వారం పది రోజుల్లో జరగొచ్చు. ది ప్యారడైజ్ కోసం మేకోవర్ అవుతున్న నాని దాని సెట్స్ లో వచ్చే నెల నుంచి అడుగు పెట్టబోతున్నాడు. అప్పటిదాకా శ్రీకాంత్ ఓదెల చైల్డ్ హుడ్ ఎపిసోడ్ తో పాటు నాని అవసరం లేని మిగిలిన టాకీ పార్ట్ ని పూర్తి చేస్తాడు. రామ్ జగదీశ్ సైతం నానిని డైరెక్ట్ చేయాలనే టార్గెట్ తో ఉన్నాడట.
This post was last modified on May 14, 2025 3:11 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…