Movie News

వీరమల్లు విడుదలకు ముహూర్తం కుదిరింది

వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల సహనానికి పెద్ద పరీక్ష పెడుతూ వచ్చిన హరిహర వీరమల్లు విడుదల తేదీ వ్యవహారం చివరి ఘట్టానికి చేరుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 13 ఈ ప్యాన్ ఇండియా మూవీ రిలీజ్ చేసేందుకు నిర్మాత ఏఎం రత్నం ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు సమాచారం. బయ్యర్ల దగ్గర బిజినెస్ డీల్స్ పూర్తి చేయడానికి రిలీజ్ డేట్ కీలకం కాబట్టి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ముందు జూన్ మొదటి వారమే అనుకున్నారు కానీ టైం సరిపోదనే ఉద్దేశంతో రెండో వారానికి షిఫ్ట్ అయినట్టు ఇన్ సైడ్ న్యూస్.

ఒకరకంగా ఇది మంచి డేటే. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో కమల్ హాసన్ తగ్ లైఫ్ వస్తుంది. జూన్ 20 కుబేర ఉంది. ఆపై వారం 27 కన్నప్ప దిగుతాడు. సో ఉభయకుశలోపరి సూత్రం ప్రకారంగా ఇది సేఫ్ గేమ్ అవుతుంది. పాజిటివ్  టాక్ వస్తే పవన్ ఎంతలేదన్నా రెండు వారాలకు పైగానే స్ట్రాంగ్ రన్ రాబడతాడు. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే నెల రోజులు నిశ్చింతగా ఉండొచ్చు. టీమ్ అయితే ఆ నమ్మకంతోనే ఉంది. ప్రస్తుతం ట్రైలర్ కట్ పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కన్సర్ట్ కోసం లండన్ వెళ్లిన కీరవాణి తిరిగి రాగానే రీ రికార్డింగ్ మొదలుపెట్టాలి. విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

సో హరిహర వీరమల్లు పార్ట్ 1 స్పిరిట్ వర్సెస్ స్వోర్డ్ కు రంగం సిద్ధమైనట్టే. ఓజి ఎలాగూ సెప్టెంబర్ లో వచ్చే సూచనలు ఉన్నాయి కనక మధ్యలో మూడు నెలల గ్యాప్ సరిపోతుంది. కాకపోతే ఇది కనక జరిగితే ఇంత తక్కువ నిడివిలో పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ కావడం మొదటిసారి అవుతుంది. ట్రైలర్ చూశాక అంచనాలు పెరుగుతాయని, ఎక్కడైనా నెగటివ్ బజ్ లాంటిది ఏదైనా ఉంటే దీంతో పూర్తిగా మాయమవుతుందని టీమ్ టాక్. క్రిష్, జ్యోతికృష్ణలు విడివిడిగా సంయుక్త దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా ఔరంగజేబుగా బాబీ డియోల్ ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేశాడు.

This post was last modified on May 13, 2025 8:54 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago