Movie News

అనురాగ్ క‌శ్య‌ప్ కూతురి పెళ్లికి డ‌బ్బు లేదంటే..

బాలీవుడ్లో గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సీపూర్ స‌హా కొన్ని గొప్ప సినిమాలు తీసి మేటి ద‌ర్శ‌కుల్లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు అనురాగ్ క‌శ్య‌ప్. కానీ గ‌త ద‌శాబ్ద కాలంలో ద‌ర్శ‌కుడిగా అనురాగ్ బాగా డౌన్ అయిపోయాడు. త‌న సినిమాలు ఆడ‌క‌పోడం, బాలీవుడ్ పోక‌డ‌లు న‌చ్చ‌క‌పోవ‌డంతో నెమ్మ‌దిగా సినిమాలు తీయ‌డ‌మే మానేశాడు. ప్ర‌స్తుతం న‌టుడిగానే బిజీగా క‌నిపిస్తున్నాడు. అత‌ను వ‌రుస‌గా త‌మిళంలోనే న‌టుడిగా సినిమాలు చేస్తున్నాడు. ఇమైక్క నోడిగ‌ల్, లియో లాంటి చిత్రాల్లో త‌న పాత్ర‌లు ఆక‌ట్టుకున్నాయి. ఇక మ‌హారాజాలో అనురాగ్ చేసిన విల‌న్ పాత్ర‌కైతే మామూలు రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమా పెద్ద హిట్ కావ‌డంలో అనురాగ్ పాత్ర‌, త‌న న‌ట‌న కీల‌క పాత్ర పోషించాయి.

ఐతే ఈ సినిమాలో తాను న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోయినా.. విజ‌య్ సేతుప‌తి బ‌ల‌వంతంగా యాక్ట్ చేయించాన‌ని.. ఈ సినిమాతో వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే త‌న కూతురి పెళ్లి చేయగ‌లిగాన‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అనురాగ్ క‌శ్య‌ప్ తెలిపాడు. త‌న‌కు న‌టుడు కావాల‌న్న ఆస‌క్తి పెద్ద‌గా లేక‌పోయినా.. ద‌ర్శ‌కుడిగా గ్యాప్ వ‌చ్చిన స‌మ‌యంలో ఇమైక్క నోడిగ‌ల్‌తో ముఖానికి రంగేసుకున్నట్లు అనురాగ్ తెలిపాడు.

ఆ సినిమా త‌ర్వాత ఒక సంద‌ర్భంలో విజ‌య్ సేతుప‌తిని క‌లిశాన‌ని.. త‌న‌తో స్నేహం పెరిగింద‌ని.. అలా ఓ సంద‌ర్భంలో త‌న కూతురి పెళ్లికి డ‌బ్బులు లేక ఇబ్బంది ప‌డుతున్న విష‌యాన్ని త‌న‌తో చెబితే.. తాము సాయం చేస్తాన‌ని సేతుప‌తి చెప్పాడ‌న్నాడు అనురాగ్. ఆ మాట‌ను గుర్తుంచుకుని మ‌హారాజ సినిమాలో విల‌న్ పాత్ర‌కు త‌న‌ను సంప్ర‌దించాడ‌ని.. కానీ త‌న‌కు న‌ట‌న మీద ప్ర‌స్తుతం ఆస‌క్తి లేద‌ని చెబుతూ, తాను ఆ క్యారెక్ట‌ర్‌ను తిర‌స్క‌రించాన‌ని అనురాగ్ గుర్తు చేసుకున్నాడు. కానీ సేతుప‌తి ప‌ట్టుబ‌ట్టి త‌న‌తో ఆ పాత్ర చేయించాడ‌ని.. ఆ సినిమాకు పారితోష‌కం కింద వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే త‌న కూతురి పెళ్లి చేశాన‌ని అనురాగ్ తెలిపాడు. మ‌హారాజాలో త‌న పాత్ర‌, న‌ట‌న‌కు కూడా మంచి పేరే వ‌చ్చాయ‌ని.. దాని వ‌ల్లే ఇప్పుడు బిజీ న‌టుడిగా మారాన‌ని అనురాగ్ తెలిపాడు.

This post was last modified on May 12, 2025 11:09 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

19 minutes ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

3 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

5 hours ago

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

8 hours ago

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు…

8 hours ago