Movie News

ర‌జినీకి న‌చ్చిన స్టోరీని మార్చేసిన లోకేష్‌

లోకేష్ క‌న‌క‌రాజ్.. ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డు. ఖైదీ, విక్ర‌మ్ లాంటి చిత్రాల‌తో అత‌ను తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌ను సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా రూపొందిస్తున్న కూలీ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. అక్కినేని నాగార్జున‌, ఉపేంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రం.. కోలీవుడ్లో తొలి వెయ్యి కోట్ల సినిమా అవుతుంద‌నే అంచ‌నాలు కూడా ఉన్నాయి. ఐతే ర‌జినీతో సినిమా ఓకే అయిన‌పుడు లోకేష్ ఆయ‌న‌కు చెప్పిన ఇది కాద‌ట‌. ముందు సూప‌ర్ స్టార్‌కు ఓ క‌థ చెబితే.. ఆయ‌న‌కు చాలా న‌చ్చింద‌ని.. కానీ రెండు నెల‌ల త‌ర్వాత వెళ్లి ఆయ‌న‌కు వేరే క‌థ చెప్పాన‌ని లోకేష్ తెలిపాడు.

ముందు అనుకున్న క‌థ ర‌జినీకి చాలా న‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌తో వేరే క‌థ చేస్తే బాగుంటుంద‌ని కూలీ స్క్రిప్టు రాశాన‌ని.. తాను క‌థ మార్చినా అభ్యంత‌ర పెట్ట‌కుండా ర‌జినీ ఈ సినిమా చేశాడ‌ని లోకేష్ తెలిపాడు. కూలీ సినిమా చేస్తూ ప్ర‌తి రోజూ ర‌జినీ నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్న‌ట్లు లోకేష్ తెలిపాడు. తాను కూలీ లాంటి మల్టీస్టార‌ర్ మూవీని ఆర్ఆర్ఆర్ త‌ర‌హాలో మూడేళ్లు తీయ‌లేన‌ని.. ఎనిమిది నెల‌ల్లోనే ఈ చిత్రం పూర్త‌యింద‌ని.. ఐతే ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు చేస్తున్న ఆర్టిస్టులంద‌రికీ వేరే సినిమా చేయ‌కుండా అదే లుక్‌లో ఉండాల‌ని మాత్రం ష‌ర‌తు పెట్టాన‌ని లోకేష్ తెలిపాడు.

త‌న త‌ర్వాతి చిత్రం ఖైదీ-2నే అని ఖ‌రారు చేసిన లోకేష్‌.. దాని త‌ర్వాత విక్ర‌మ్-2 ఉంటుంద‌న్నాడు. విజ‌య్‌తో లియో-2 కూడా చేయాల్సి ఉంద‌ని, అలాగే రోలెక్స్ పాత్ర‌తో స్టాండ్ అలోన్ మూవీకి కూడా ఐడియా రెడీ అయింద‌ని లోకేష్ తెలిపాడు. ఇక ర‌జినీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ ఇద్ద‌రినీ పెట్టి ఒక మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌ని ఉంద‌ని.. ఇద్ద‌రు వ‌య‌సు మీద ప‌డ్డ గ్యాంగ్ స్ట‌ర్స్ జీవితాల‌ను ఈ సినిమాలో చూపిస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నాన‌ని.. ఆ ఐడియాను వాళ్లిద్ద‌రికీ చెప్ప‌డం కూడా అయింద‌ని.. ఇక నిర్ణ‌యం తీసుకోవాల్సింది వారే అని.. కానీ అదంత తేలికైన విష‌యం కాద‌ని లోకేష్ అన్నాడు. లియో మీద వ‌చ్చిన‌ విమ‌ర్శ‌లకు తానేమీ దిగాలు ప‌డిపోలేద‌ని.. కానీ ఫీడ్ బ్యాక్ మాత్రం తీసుకున్నాన‌ని లోకేష్ చెప్పాడు.

This post was last modified on May 12, 2025 10:55 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago