స్టార్ హీరోలు తమ దర్శకులకు కార్లను కానుకగా ఇవ్వడం కొత్తేమి కాదు. చాలా సార్లు చూసిందే. హఠాత్తుగా ఇవ్వడమో లేక సర్ప్రైజ్ అంటూ ముందే చెప్పకుండా ప్రెజెంట్ చేయడం ఎన్నోసార్లు జరిగింది. కానీ కొన్ని మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటిదే ఇది. గత ఏడాది సత్యం సుందరంతో దర్శకుడు ప్రేమ్ కుమార్ ఒక అద్భుతమైన ఎమోషన్ ని ప్రేక్షకులకు చూపించిన సంగతి తెలిసిందే. కార్తీ, అరవింద్ స్వామి కలయికలో కమర్షియల్ హంగులు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలు, ప్రయాణాన్ని గొప్పగా చూపించిన తీరు ఆడియన్స్ ని కట్టిపడేసింది. రికార్డులు కొట్టకపోయినా మనసులను గెలుచుకుంది.
ఇది రిలీజయ్యాక ప్రేమ్ కుమార్ తాను ఎప్పటి నుంచో లక్ష్యంగా పెట్టుకున్న మహేంద్ర కంపెనీ థార్ రాక్స్ ఏఎక్స్ 5ఎల్ ఫోర్ బై ఫోర్ అయిదు డోర్లు ఉండే జీపుని కొనాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఎంత వెతికినా తెలుపు రంగులో ఆ వాహనం దొరకడం లేదు. దీంతో తనకు, సూర్య ఫ్యామిలీకి దగ్గరైన రాజాని ఈ బండి దొరికే మార్గాలుంటే చూడమని అడిగాడు. ఆయన శాయశక్తులా ప్రయత్నించాడు కానీ లాభం లేకపోయింది. ఈ లోగా జీపు కోసం ప్రేమ్ కుమార్ దాచుకున్న డబ్బు వేరే అవసరాలకు ఖర్చయిపోయింది. దీంతో ప్రేమ్ కుమార్ ఇక ప్రయత్నాలు ఆపేయమని రాజాకి చెబితే అతను మౌనంగా నవ్వి సరేనన్నాడు.
కొద్దిరోజుల తర్వాత సూర్య నుంచి ప్రేమ్ కుమార్ కు ఒక మెసేజ్ వచ్చింది. అతను కోరుకున్న థార్ రాక్స్ జీపు వైట్ కలర్ ఫోటోని జోడించి ఇది వచ్చిందని అందులో పేర్కొన్నాడు. దీంతో ఖంగారు పడిపోయిన ఈ కల్ట్ డైరెక్టర్ వెంటనే రాజాకు ఫోన్ చేసి తన దగ్గర డబ్బులు లేవని, ఇప్పుడు కొనలేనని అన్నాడు. వెంటనే రాజా నవ్వుతు ఇది సూర్య మీకు ఇస్తున్న కానుకని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ్ నోటి వెంట మాట రాలేదు. ఇంటికి పిలిపించి దాన్ని బహుకరించాక ఆగకుండా 50 కిలోమీటర్లు తిరిగేశాడు. ఖరీదు ఎంతనేది పక్కనపెడితే కోరుకున్న రంగులో కోరుకున్న మోడల్ ని అంత శ్రమపడి వెతికి గిఫ్ట్ గా ఇవ్వడం గొప్పేగా.
This post was last modified on May 11, 2025 10:15 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…