నిన్న విడుదలైన సింగిల్ కు యూత్ నుంచి మంచి మద్దతే దక్కింది. గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షో ద్వారా 50 వేలకు పైగా ముందస్తు టికెట్లు అమ్ముడుపోయిన తెలుగు సినిమా ఇదొక్కటే. తర్వాతి స్థానంలో జగదేకవీరుడు అతిలోకసుందరి ఉంది. దీని కౌంట్ సుమారు 18 వేల టికెట్ల దాకా ఉంది. ఉదయం షో కొంచెం నెమ్మదిగా ఓపెనైనా తర్వాత సింగిల్ ఊపందుకుంది. ముఖ్యంగా ఏ సెంటర్స్ మల్టీప్లెక్సుల్లో సాయంత్రం నుంచి ఆక్యుపెన్సీలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. వీకెండ్ వసూళ్లు కీలకం కాబోతున్నాయి.
ట్రేడ్ నుంచి అందుతున్న ప్రాధమిక సమాచారం మేరకు సింగిల్ కు మొదటి రోజు సుమారు నాలుగు కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు తెలిసింది. ఇది మంచి నెంబరే. యూత్ ని టార్గెట్ చేసుకున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ లో సామజవరగమన రచయితలు భాను – నందు రాసిన వన్ లైనర్లు, పంచులు బాగా పేలాయి. కార్తీక్ రాజ్ దర్శకత్వం ఎలాంటి హడావిడి లేకుండా నీట్ గా సాగడంతో ఆడియన్స్ ని సంతృప్తి పరచడంలో సింగిల్ బాగానే సక్సెసవుతోంది. పోటీలో ఉన్న సమంత నిర్మించిన శుభంకు కూడా డీసెంట్ టాక్ వచ్చినా మరీ పెద్దగా చెప్పుకునేంత లేదు. బుక్ మై షో అమ్మకాలు 9 వేల టికెట్ల దాకా ఉన్నాయి.
సో శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా లేదానేది ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది. హిట్ 3 ది థర్డ్ కేస్ నెమ్మదించడం, శుభం కాంపిటేషన్ కాకపోవడం లాంటి సానుకూల అంశాలను సింగిల్ ఎలా వాడుకుంటుందనేది చూడాలి. మ్యాడ్ స్క్వేర్ తర్వాత మళ్ళీ యువతను థియేటర్లకు రప్పించిన సినిమా మరొకటి లేదు. ఎలాగూ సెలవులు నడుస్తున్నాయి. కాలేజీలు, స్కూళ్ళు లేవు. సో ఉన్న ఆప్షన్లలో వాళ్లకు సింగిలే బెటర్ ఆప్షన్ గా తోస్తే వసూళ్లు మరింత మెరుగు పడతాయి. వచ్చే వారం చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు లేకపోవడం కలిసి వచ్చేలా ఉంది. స్వాగ్ ఫలితంతో కాసింత నిరుత్సాహపడ్డ శ్రీవిష్ణుకి సింగిల్ ఊరట కలిగించేలా ఉంది.