నేచురల్ స్టార్ నాని నుంచి ‘హిట్-3’ లాంటి వయొలెంట్ ఫిలిం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇందులో వయొలెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక బూతుల సంగతి చెప్పాల్సిన పని లేదు. ‘హిట్-3’ ట్రైలర్ చూసినపుడే చాలామంది నాని ఇలాంటి సినిమా చేయడమేంటి అని అన్నారు. తన క్లాస్ ఫ్యాన్స్ కొంతమేర ఈ సినిమాకు దూరమయ్యారు కూడా. నిజానికి నాని సైతం ‘హిట్-3’ స్క్రిప్టు గురించి చెప్పినపుడు కొంచెం కంగారు పడ్డాడట. దర్శకుడు శైలేష్ కొలను రాసిన కొన్ని సీక్వెన్సులు చూసి ఇంత డార్క్‌గా ఉన్నాయేంటి అని షాకయ్యాడట. అందులో 9 నెలల పసికందుకు సంబంధించిన సన్నివేశం కూడా ఒకటని శైలేష్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఈ సీక్వెన్స్ గురించి నాని సహా అందరూ తన గురించి అదోలా అనుకున్నట్లు శైలేష్ తెలిపాడు. నానితో పాటు ఈ చిత్రంలో విలన్ పాత్ర చేసిన ప్రతీక్ బబ్బర్ సైతం.. తాను రాసిన ఆ సీక్వెన్స్ గురించి విన్నపుడు ‘‘నీకేదైనా సమస్య ఉందా’’ అని అడిగినట్లు శైలేష్ వెల్లడించాడు. తన భార్య సైతం ‘హిట్-3’ స్క్రిప్టు గురించి చెప్పినపుడు భయపడిందని అతను తెలిపాడు. ఐతే తనకూ 4 ఏళ్ల పాప ఉందని.. కానీ స్క్రిప్టు రాస్తున్నపుడు తాను ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే రాస్తానని అతను చెప్పాడు.
నిజ జీవితంలో ఇంతకంటే ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయని.. వాటి గురించి చదివి ఇన్‌స్పైర్ అయి స్క్రిప్టు రాస్తానని.. ‘హిట్-3’ తరహా కథలు రాసేటపుడు.. తాను ఎవరితోనూ మాట్లాడకుండా దూరంగా వెళ్లిపోయి ఆ పనిలోనే ఉంటానని శైలేష్ తెలిపాడు. ‘హిట్-3’ రీసెర్చ్‌లో భాగంగా ‘డార్క్ వెబ్’ గురించి చాలా తెలుసుకున్నానని.. తెలంగాణ పోలీసులు తనకు వాళ్ల దగ్గర్నుంచి అంతర్గత సమాచారం చాలానే ఇచ్చారని.. అందువల్లే ‘డార్క్ వెబ్’ గురించి సినిమాలో అంత బాగా చూపించగలిగానని శైలేష్ చెప్పాడు.
This post was last modified on May 10, 2025 10:09 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…