Movie News

నాని-శైలేష్… హిలేరియస్ కామెడీ

నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’తో తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టాడు. గత వారం విడుదలైన ఈ చిత్రం.. తొలి వీకెండ్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ‘హిట్-3’ నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. ప్రస్తుతం రెండో వీకెండ్లోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్లు వస్తున్నాయి ఈ చిత్రానికి. ‘హిట్-3’ దర్శకుడి చివరి చిత్రం ‘సైంధవ్’ పెద్ద డిజాస్టర్ అయింది. అయినా అతణ్ని నమ్మి తన ప్రొడక్షన్లో ‘హిట్’ ఫ్రాంఛైజీలో మూడో సినిమాకు అవకాశమివ్వడమే కాక.. అందులో హీరోగా కూడా నటించాడు నాని. అతడి నమ్మకాన్ని శైలేష్ నిలబెట్టుకుని పెద్ద హిట్ ఇచ్చాడు. మరి వీరి కలయికలో తర్వాతి చిత్రమేంటి? మళ్లీ ఎప్పుడు కలిసి సినిమా చేస్తారు అన్నది ఆసక్తికరం. దీనికి ‘హిట్-3’ సక్సెస్ మీట్లో నాని స్వయంగా జవాబు ఇచ్చాడు.

మళ్లీ తాను హీరోగా శైలేష్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని.. కానీ జానర్ మారుతుందని నాని క్లారిటీ ఇచ్చాడు. ‘హిట్’ ఫ్రాంఛైజీ ఇక ముందు కూడా కొనసాగబోతున్న సంగతి తెలిసిందే. హిట్-4లో కార్తి హీరోగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. హిట్-4 లేదా హిట్-5లో తన క్యామియో కోసం శైలేష్ అడుగుతాడని.. తన ప్రొడక్షనే కాబట్టి తప్పకుండా చేస్తానని.. ఐతే ఇది కాకుండా తాను శైలేష్ దర్శకత్వంలో వేరే సినిమా కూడా చేస్తానని నాని తెలిపాడు.

తమ కలయికలో తర్వాత వచ్చే సినిమా పక్కా కామెడీ ఎంటర్టైనర్‌గా ఉంటుందని అతను వెల్లడించాడు. శైలేష్ హిట్ సిరీస్‌లో వరుసగా థ్రిల్లర్లు తీసి ఉండొచ్చని.. కానీ అతడిలో మంచి కామెడీ సెన్స్ ఉందని నాని చెప్పాడు. సెట్లో ఎప్పుడూ జోకులు పేలుస్తూ ఉంటాడని.. తన సెన్సాఫ్ హ్యూమర్ సూపరని నాని కితాబిచ్చాడు. శైలేష్‌కు కూడా మంచి కామెడీ సినిమా చేయాలనుందని.. తనకు ఒక ఐడియా కూడా చెప్పాడని.. అది తనకు నచ్చిందని.. కాబట్టి తామిద్దరం మళ్లీ కలిసి సినిమా చేస్తే అది హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉంటుందని నాని చెప్పాడు. బహుశా రెండు మూడేళ్ల తర్వాత ఈ సినిమా ఉంటుందేమో.

This post was last modified on May 10, 2025 5:06 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago