పెద్ద పెద్ద స్టార్లకే కాదు.. అప్ కమింగ్ హీరోలకు కూడా పేరు వెనుక ఏదో ఒక బిరుదు ఉండాల్సిందే. కొందరు హీరోలకు అభిమానులే ఏవో బిరుదులు ఇచ్చుకుంటారు. కొందరు స్టార్లు సొంతంగా ట్యాగ్స్ ఇచ్చుకుని పీఆర్ టీంలతో పాపులర్ చేయించుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ హీరో చేస్తున్న సినిమా బృందమే కొత్త ట్యాగ్ లైన్ ఇచ్చేస్తుంటుంది. ఐతే ఆ బిరుదులు ప్రేక్షకులకు కన్విన్సింగ్‌గా అనిపించడం కీలకం. వాళ్లు కన్విన్స్ అయితే ఇక ట్యాగ్ లైన్స్ కంటిన్యూ చేయడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. నానికి ‘నేచురల్ స్టార్’ అని ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో ట్యాగ్ లైన్ ఇస్తే ప్రేక్షకులందరూ ఆమోదం తెలిపారు. ఇప్పుడు మరో యంగ్ హీరోకు తన చిత్ర బృందం కొత్త బిరుదు ఇచ్చింది. ఆడియన్స్ కూడా ఈ విషయంలో కన్విన్స్ అయినట్లే కనిపిస్తున్నారు.
శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘సింగిల్’లో తన పేరు ముందు ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అని వేశారు. ‘సింగిల్’ సినిమా చూసిన వాళ్లకు ఇది యాప్ట్ అనే అనిపిస్తోంది. ఇందులో విష్ణు మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు. తన మార్కు కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టేశాడు శ్రీ విష్ణు. బూతులను అర్థమయ్యీ కానట్లుగా పలుకుతూ శ్రుతిలో కలిపేయడం.. స్టార్ హీరోల పాపులర్ డైలాగులను ఇమిటేట్ చేయడంలో శ్రీ విష్ణు స్టైలే వేరు. సామజవరగమన, ఓం భీం బుష్, స్వాగ్ లాంటి చిత్రాల్లో ఇలాగే ఆడియన్సుని ఎంటర్టైన్ చేశాడు. ‘సింగిల్’ ట్రైలర్లో తన డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి.
ఇక సినిమాలో పంచులు అంచనాలను మించి వర్కవుట్ అయ్యాయి. వెన్నెల కిషోర్‌తో కలిసి విష్ణు నాన్ స్టాప్ కామెడీతో అలరించాడు ‘సింగిల్’లో. చాన్నాళ్ల తర్వాత థియేటర్లు నవ్వులతో హోరెత్తుతున్నాయి. కేవలం శ్రీ విష్ణు కోసమే యూత్ థియేటర్లకు వస్తున్నారు. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకప్పుడు మూడీగా కనిపించే క్యారెక్టర్లు, సీరియస్ సినిమాలే చేస్తూ వచ్చిన శ్రీ విష్ణు.. ఇప్పుడిలా ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్ అయిపోవడం విశేషం. ఈ మేకోవరే తన ఫాలోయింగ్‌ను పెంచింది. శ్రీ విష్ణు ఫాలోయింగ్ ఎంత పెరిగిందో చెప్పడానికి ‘సింగిల్’ థియేటర్లలో జనాల సందడి, వస్తున్న ఓపెనింగ్సే నిదర్శనం. చూస్తుంటే అతను ఒక స్టార్‌గా ఎదిగాడనే అనిపిస్తోంది.
This post was last modified on May 10, 2025 12:59 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…