Movie News

కొత్త కబుర్లు పంచుకున్న న్యాచురల్ స్టార్

హిట్ 3 ది థర్డ్ కేస్ మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ దాటేసి విజయవంతంగా రెండో వారంలోకి అడుగు పెట్టేసింది. ఇండో పాక్ సరిహద్దుల్లో ఏర్పడిన యుద్ధ వాతావరణం వల్ల సినీ సెలబ్రిటీలు వీలైనంత ఈవెంట్లు లేకుండా చూసుకుంటున్నారు కానీ న్యాచురల్ స్టార్ నాని ఈ రోజు హిట్ 3 సక్సెస్ మీట్ పెట్టి ఇలా చేయడం వెనుక ఉద్దేశంతో పాటు కొత్త కబుర్లు పంచుకున్నాడు. పాకిస్థాన్ కు చాలా పద్దతిగా ఇండియన్ ఆర్మీ బుద్ది చెబుతోందని, శత్రుదేశం వల్ల ఒక భారతీయ సినిమా సెలబ్రేషన్ చేయలేదనే కారణం వాళ్లకు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే టీమ్ అందరితో డిస్కస్ చేసి ఇది ఏర్పాటు చేసినట్టు వివరించాడు.

ఇక విశేషాల వైపు చూస్తే హిట్ 4లో ఏసిపి వీరప్పన్ గా చేయబోతున్న కార్తీతో ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నాడు నాని. ఇంకా సినిమా చూడాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ రివీల్ చేయలేదు. మిక్కీ జె మేయర్ ని తీసుకోవడం గురించి కామెంట్స్ వచ్చాయని, ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ కి అతను ఎలా న్యాయం చేస్తాడని అన్నారని, కానీ ఇలాంటి వాటికి గతంలో పని చేసిన వాళ్ళను కాకుండా ఒక ఫ్రెష్ సౌండ్ కోసం మిక్కీని తీసుకొచ్చామని, అదిప్పుడు మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు. శైలేష్ కొలనుతో కామెడీ సినిమా ఉండొచ్చని, కాకపోతే ఎప్పుడనేది చెప్పలేనని అన్నాడు.

ఈ వీకెండ్ కి హిట్ 3కి కీలకం కానుంది. కొత్త రిలీజులు సింగిల్, శుభంకు డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ అవి మాస్ ని టార్గెట్ చేసినవి కాకపోవడంతో నానికి మరో ఛాన్స్ దక్కింది. ఎలాగూ ఆడియన్స్ కి ఎక్కువ ఆప్షన్స్ లేవు. బుకింగ్స్ మళ్ళీ ఊపందుకున్న వైనం బుక్ మై షోలో కనిపిస్తోంది. దీన్ని ఇంకాస్త బలంగా పుష్ చేసే ఉద్దేశంతో నాని విజయోత్సవం చేసుకున్నాడు. రిలీజైన టైంలో వెంటనే అమెరికా వెళ్లి ప్రమోషన్లలో పాల్గొనాల్సి రావడంతో నాని అందుబాటులో లేడు. అందుకే రాగానే సక్సెస్ ని ఈ విధంగా పంచుకున్నాడు. వారాంతం నెంబర్లు కనక బాగుంటే మెల్లగా నూటా యాభై కోట్ల వైపు అడుగులేయొచ్చు.

This post was last modified on May 10, 2025 10:03 am

Share
Show comments
Published by
Kumar
Tags: Hit 3Nani

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

46 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago