గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. అమాయకులను ప్రేరేపించి వాళ్ళతో హత్యలు చేయించి తన స్థావరంలో ప్రమాదకరమైన ఆటలు ఆడించే సైకో కిల్లర్ గా తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇతని నేపథ్యం గురించి మన ప్రేక్షకులకు అవగాహన తక్కువ. అదేంటో చూద్దాం. ప్రతీక్ బబ్బర్ తల్లి స్మితా పాటిల్. 80 దశకంలో బాలీవుడ్ ని ఊపేసిన హీరోయిన్లలో ఈమె ఒకరు. గ్లామర్ తో కాకుండా పెర్ఫార్మన్స్ తో పేరు తెచ్చుకున్నారు. 1986లో రిలీజైన మిర్చి మసాలాలో నటనకు గాను ఫోర్బ్స్ పత్రిక టాప్ 25 లిస్టులో చోటు ఇచ్చింది.
అమితాబ్ బచ్చన్ శక్తి, ఓంపూరి అర్ద్ సత్యతో స్మిత నేషన్ వైడ్ సెన్సేషన్ అయ్యారు. ప్రముఖ నటుడు, హీరో రాజ్ బబ్బర్ ని పెళ్లి చేసుకున్నాక పుట్టిన సంతానమే ప్రతీక్ బబ్బర్. తర్వాత రెండు వారాలకే స్మిత అనారోగ్యంతో కన్నుమూశారు. అతి చిన్న వయసులో పద్మశ్రీ, రెండు జాతీయ అవార్డులు అందుకున్న ఘనత స్మిత పాటిల్ కు దక్కింది. ఆమెకు గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. ప్రతీక్ బబ్బర్ కు ఊహ తెలియక ముందే స్మిత పాటిల్ 31 సంవత్సరాలకు 1986లో కన్ను మూయడం విషాదం. అందుకే తల్లి పేరుని తన పేరుతో కలిపి ఉంచమని ప్రతీక్ తన నిర్మాతలకు చెబుతూ ఉంటాడు.
రాజ్, స్మితలకు ప్రతీక్ బబ్బర్ ఒక్కడే సంతానం. బాలీవుడ్ సినిమాల్లో విలన్ గా కనిపిస్తూ ఉంటాడు. సల్మాన్ ఖాన్ సికందర్ లోనూ ఉన్నాడు. 2008 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూన్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ లో చేశాడు కానీ ఆశించినంత గుర్తింపు రాలేదు. హిట్ 3 ప్రతినాయకుడిగా ఒక కొత్త మొహం కోసం వెతుకుతున్న టైంలో దర్శకుడు శైలేష్ కొలనుకు ప్రతీక్ బబ్బర్ కనిపించాడు. ఇతనైతే న్యాయం చేయగలడని భావించి వెంటనే ఎంపిక చేసుకున్నాడు. సెకండాఫ్ కే పరిమితమైనప్పటికీ తన ఉనికిని చాటుకున్నాడు. హిట్ 3 తనకు మరిన్ని అవకాశాలు తీసుకొస్తుందని ప్రతీక్ బబ్బర్ ఎదురు చూస్తున్నాడు.
This post was last modified on May 9, 2025 12:46 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…