దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్నాడు సోనూ సూద్. అయితే ఇన్నేళ్లలో సినిమాలతో తెచ్చుకున్న పేరంతా ఒకెత్తయితే.. కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్ టైంలో తన సేవా కార్యక్రమాలతో సంపాదించిన పేరు మరో ఎత్తు. వలస కార్మికులతో మొదలుపెట్టి ఎంతో మంది అభాగ్యులను అతను ఆదుకున్నాడు. లాక్ డౌన్ ముగిశాక కూడా అతను సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు.
వివిధ మార్గాల్లో తనను సాయం కోసం అభ్యర్థిస్తున్న వాళ్ల వివరాలు తెలుసుకుని తన టీం ద్వారా సాయపడుతున్నాడు. ఇందుకు ప్రధానంగా సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది. ఐతే నేరుగా సోనూనూ కలిసే వారి సంఖ్య కూడా తక్కువగా ఏమీ లేదు. సోనూ ముంబయిలో ఇంటిదగ్గర ఉన్నా.. లేదా బయటెక్కడైనా షూటింగ్‌కు వెళ్లినా.. అక్కడ ఒక గ్రీవెన్స్ సెల్ లాంటిది ఏర్పాటవుతుంటడం విశేషం.
దేశంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లు సోనూ టీంను సంప్రదించి అతనెక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వచ్చేస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. తాజాగా సోనూ హైదరాబాద్‌లో బెల్లకొండ శ్రీనివాస్ సినిమా ‘అల్లుడు అదుర్స్’లో నటిస్తుండగా.. అక్కడికి రోజూ పదుల సంఖ్యలో జనం వస్తున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణించి సోనూ కలుస్తుండటం విశేషం. సోనూతో పాటు రెండంకెల సంఖ్యలో అతడి టీం కూడా వెంట వచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది.
ఓవైపు సోనూ టీం, మరోవైపు అతణ్ని సాయం కోసం కలిసేవాళ్లతో షూటింగ్ స్పాట్‌లో హంగామా కనిపిస్తోంది. యూనిట్లో ఎంతమంది ఉన్నారో.. అంతకుమించి సోనూ చుట్టూ జనం ఉంటున్నారు ఎప్పుడూ. దీంతో ఆ ప్రాంతమంతా గోల గోలగా మారిపోతోంది. ఇది చిత్ర బృందానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, సమయం వృథా అవుతున్నా, తమ ఖర్చు పెరుగుతున్నా.. సోనూ మంచి మనసును దృష్టిలో ఉంచుకుని చిత్ర బృందం సర్దుకుంటోంది.
This post was last modified on November 5, 2020 6:18 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…