పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నేళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న సినిమా.. హరిహర వీరమల్లు. పవన్ కెరీర్లో మేకింగ్ కోసం అత్యధిక సమయం తీసుకున్న చిత్రమిదే. అనౌన్స్ అయిన ఐదేళ్లకు గానీ ఈ సినిమా రిలీజ్ కావట్లేదు. ఈ ఏడాది ఆల్రెడీ రెండు డేట్లు మిస్ అయిందీ చిత్రం. నెక్ట్స్ టార్గెట్ మే 30 అని వార్తలు వచ్చాయి. కానీ అది సాధ్యం కాదని తెలుస్తోంది. అప్పటికి సినిమాను రెడీ చేయడం కష్టమని అంటున్నారు. పైగా అదే డేట్‌కు రావాల్సిన ‘కింగ్‌డమ్’ను వాయిదా వేయడంలోనూ కొన్ని ఇబ్బందులున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ విడుదల తేదీలను పరిశీలిస్తున్నారు.
జూన్ తొలి వారం కమల్ హాసన్ సినిమా ‘థగ్ లైఫ్’, బాలీవుడ్ క్రేజీ సీక్వెల్ ‘హౌస్ ఫుల్-5’ పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతున్నాయి. వాటికి పోటీగా వెళ్లడం కుదరదు. దీంతో జూన్ 12 డేట్‌ను వీరమల్లు టీం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంలో ఓటీటీ డీల్ పరంగా కూడా ఒక చిక్కుముడి ఉంది. డిజిటల్ హక్కులు తీసుకుంటున్న సంస్థ ఫిక్స్ చేసే ఓటీడీ రిలీజ్ డేట్‌ను అనుసరించి కూడా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
అందరికీ ఆమోదయోగ్యమైన తేదీ జూన్ 12 అని తాజాగా వార్తలు వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ మేరకు సమాచారం ఇచ్చేసినట్లు చెబుతున్నారు. విశేషం ఏంటంటే.. ఆన్ లైన్ టికెటింగ్ యాప్ ‘బుక్ మై షో’లో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ పేర్కొన్నారు. జూన్ 12న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు ప్రస్తావించారు. దీంతో పవన్ అభిమానులు ఆ డేట్‌కే ఫిక్స్ అయిపోతున్నారు. పవన్ ఇటీవలే చివరి షెడ్యూల్ చిత్రీకరణకు హాజరై సినిమాను పూర్తి చేసినట్లుగా అప్‌డేట్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇంకో నెల రోజుల్లో ‘వీరమల్లు’ ఆగమనం ఖాయమే అనుకోవాలి.
This post was last modified on May 9, 2025 7:50 am
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…