అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం ప్రీ ప్రోడుక్షన్ పనుల్లో బిజీగా ఉంది. పాత్రల ప్రాధాన్యతకు అనుగుణంగా చిన్నా పెద్ద కలిపి ఇందులో అయిదుగురు హీరోయిన్లు ఉంటారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ప్యాన్ ఇండియా మూవీలో బన్నీ హీరో, విలన్ గా డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు వస్తున్న అప్డేట్ అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. అధికారికంగా ప్రకటించలేదు కానీ గతంలోనే వచ్చిన ఈ లీక్ దాదాపు నిజమే. అయితే ఇలా నాయకుడు, ప్రతినాయకుడిగా రెండు క్యారెక్టర్స్ పోషించే సాహసం చేసిన హీరోలు గతంలోనూ ఉన్నారు.
మచ్చుకు కొన్ని చూద్దాం. సూర్య (24), కమల్ హాసన్ (అభయ్), కృష్ణ (మానవుడు దానవుడు), బాలకృష్ణ (సుల్తాన్), రజనీకాంత్ (రోబో), విజయ్ (గోట్ గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం), ఫ్యాన్ (షారుఖ్ ఖాన్), శోభన్ బాబు (జగన్) ముఖ్యమైన ఉదాహరణలుగా చెప్పుకొచ్చు. ఇవన్నీ డబుల్ ఫోటో సినిమాలే. కాకపోతే అధిక శాతం బ్లాక్ బస్టర్లు కాలేకపోయాయి. రోబో ఒకటే ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ ఈ లిస్టులో చేరబోతున్నాడు. సై ఫై జానర్ కాబట్టి విలన్ పాత్ర డిజైనింగ్ ఊహకందని రీతిలో ఉంటుందని తెలిసింది. గెటప్ షాక్ ఇచ్చేలా దర్శకుడు అట్లీ డిజైన్ చేసుకున్న తీరు అబ్బురపరచడం ఖాయమంటున్నారు.
2026 విడుదలను లక్ష్యంగా పెట్టుకున్న ఈ విజువల్ గ్రాండియర్ కోసం అంతర్జాతీయ సంస్థలు పని చేస్తున్నాయి. సూపర్ హీరో కాన్సెప్ట్ ని అంతర్లీనంగా తీసుకుని దానికి తనదైన శైలి కమర్షియల్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నాడు అట్లీ. పుష్ప తర్వాత చేస్తున్న సినిమా కావడంతో బన్నీ సైతం చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇంకో మెయిన్ విలన్ ఎవరనేది మాత్రం గుట్టుగా ఉంచుతున్నారు. విదేశీ నటుడిని తీసుకునే ప్లాన్ లో ఉన్నారట. అదెవరనేది తెలియాల్సి ఉంది. ఐకాన్ స్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ దీన్ని నిర్మించబోతోంది. 500 కోట్ల పైమాటేనని టాక్.
This post was last modified on May 7, 2025 4:47 pm
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…