లాక్ డౌన్ దెబ్బకు అల్లాడిపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. అందులోనూ ఆ రంగంలో అత్యధిక ఆదాయానికి కేంద్ర బిందువైన థియేటర్ల పరిశ్రమ కరోనా వల్ల దారుణంగా దెబ్బ తింది. సినిమాల మీద ఆధారపడ్డ మిగతా వాళ్లందరూ మళ్లీ పని మొదలుపెట్టారు కానీ.. థియేటర్లను నమ్ముకున్న వాళ్లకు మాత్రం ఇప్పటికీ ఉపాధి లేదు. గత నెలలో థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా పది శాతం థియేటర్లు కూడా తెరుచుకోలేదు.
థియేటర్లు మళ్లీ ఎప్పటికీ సాధారణ స్థాయిలో నడుస్తాయో తెలియట్లేదు. ఈ రంగం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. మరింత నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేలా ఉంది. దేశంలోనే అతి పెద్ద థియేట్రికల్ చైన్ అయిన పీవీఆర్ సంస్థ ఈ ఏడాది మూడో క్వార్టర్‌కు సంబంధించి తాజాగా విడుదల చేసిన లాభ నష్టాల లెక్కలు చూస్తే థియేటర్ల పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.
అన్ని థియేట్రికల్ ఛైన్స్ లాగే ఈ ఏడాది తొలి క్వార్టర్లో మంచి ఆదాయం అందుకున్న పీవీఆర్.. రెండో క్వార్టర్లో దారుణంగా దెబ్బ తింది. మూడో క్వార్టర్‌లో మరింతగా సంస్థ పతనం అయింది. గత మూడు నెలలకు గాను ఆదాయం లేకపోగా రూ.184 కోట్ల నష్టం వాటిల్లిందట పీవీఆర్‌కు. థియేటర్ల మెయింటైనెన్స్, సిబ్బందికి ఇస్తున్న అరకొర జీతాలు లెక్క వేసినా ఇంత మొత్తంలో నష్టం వాటిల్లింది.
గత ఏడాది ఇదే క్వార్టర్లో ఆ సంస్థ రూ.48 కోట్లు లాభాలు అందుకుంది. గత నెల 15న థియేటర్లు తెరవడం వల్ల గత రెండు వారాల్లో కొంత మేర ఆదాయం వచ్చింది. కానీ ఆ మొత్తం థియేటర్ల మెయింటైనెన్స్‌కు కూడా సరిపోని పరిస్థితి. గత ఏడాది సెప్టెంబరు 30 నాటికి పీవీఆర్ నికర ఆదాయం రూ.973 కోట్లుగా ఉండగా.. ఈసారి అది రూ.40 కోట్లకు పడిపోయింది. మిగతా మల్టీప్లెక్సుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on November 5, 2020 7:48 am
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నిత్యం…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి…
తెలంగాణ అసెంబ్లీలో గురువారం చోటుచేసుకున్న రచ్చ… బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నేపథ్యంలో కలకలం…
ఖుషి తర్వాత స్క్రీన్ పై కనిపించకుండా పోయిన సమంతా తిరిగి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన…
టాలీవుడ్ హీరోల్లో నానికి ఉన్న క్రెడిబిలిటీనే వేరు. ప్రతి హీరోకూ కెరీర్లో ఫ్లాపులు తప్పవు కానీ.. నాని కెరీర్ సక్సెస్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరోవైపు…