మొదటి వారం కాకుండానే హిట్ 3 ది థర్డ్ కేస్ వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది. కేవలం నాలుగు రోజులకే ఈ ఫీట్ సాధించడం ఊహించనిది. ఎందుకంటే ఏ రేటెడ్ మూవీ, అందులోనూ నానినే స్వయంగా ఫ్యామిలీలను రావొద్దని చెప్పిన సినిమా ఇంత వేగంగా ఈ మైలురాయి అందుకోవడం ట్రేడ్ వర్గాలను ఆనందంలో ముంచెత్తుతోంది. నిన్న మొన్న వీకెండ్ ని అర్జున్ సర్కార్ డామినేట్ చేశాడు. తనకన్నా మెరుగైన టాక్ తెచ్చుకున్న తుడరుమ్ తో తలపడుతూ, నార్త్ లో పెద్ద రిలీజ్ దక్కించుకున్న రైడ్ 2 కి ధీటుగా బుక్ మై షోలో నెంబర్లు నమోదు చేయడం మార్కెట్ పరంగా పెరిగిన నాని ఇమేజ్ ని సూచిస్తుంది.
అసలు విషయం వేరే ఉంది. నాని ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తానికి వంద కోట్ల ధైర్యాన్ని ఇచ్చాడు. నెలరోజులకు పైగా థియేటర్లలో జనం లేక షోలు క్యాన్సిలవుతూ అసలు టాలీవుడ్ ఎటు పోతోందో అని ఆందోళన వ్యక్తమవుతున్న టైంలో ఇంత కలెక్షన్ రాబట్టడం మాములు జోష్ ఇవ్వడం లేదు. అటుపక్క ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ దాటేయడం ఇంకో శుభ పరిమాణం. ఇదే సమయంలో నాని అమెరికాలో ప్రమోషన్ టూర్ చేయడం మరింత మెరుగైన నెంబర్లకు దోహదం చేసేలా ఉంది. దసరా కన్నా వేగంగా సెంచరీ కొట్టిన హిట్ 3కి అసలు పరీక్ష ఇవాళ సోమవారం నుంచి మొదలుకానుంది. ఎంత డ్రాప్ ఉంటుందనేది కీలకం కానుంది.
రాబోయే శుక్రవారం కొత్త రిలీజులు శ్రీవిష్ణు సింగిల్, సమంతా నిర్మించిన శుభం ఉన్నాయి. వీటి నుంచి ఎంత థ్రెట్ ఉంటుందనేది టాక్ మీద ఆధారపడి ఉంటుంది. జగదేకవీరుడు అతిలోకసుందరి హడావిడి ఒకటి రెండు రోజులకే పరిమితం కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. ఏపీలో తీసుకున్న టికెట్ రేట్ల పెంపు హిట్ 3కి బుధవారంతో ముగుస్తుంది. సాధారణ ధరలతో హిట్ 3 పికప్ కావడం కీలకం. దర్శకుడు శైలేష్ కొలను ఇక్కడి ప్రమోషన్లు కొనసాగిస్తూ ఉండగా నాని, శ్రీనిధి శెట్టి యుఎస్ పబ్లిసిటీలో భాగమయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ నూటా యాభై కోట్లకు కానుంది. ఇదంత సులభం కాదు కానీ చూడాలి ఎక్కడి దాకా వెళ్తుందో.
This post was last modified on May 5, 2025 12:08 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…