గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా ఉన్న పేరును కోలీవుడ్ బాగా చెడగొట్టుకుంది. గతంలో అద్భుతమైన సినిమాలు తీసిన ఎంతోంమది గొప్ప దర్శకులు ఇప్పుడు తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. అక్కడ కొత్త దర్శకులు కూడా అంతగా మెప్పించడం లేదు. సరికొత్త సినిమాలకు పట్టం కట్టి తమ అభిరుచిని చాటుకున్న తమిళ ప్రేక్షకులు సైతం ఇప్పుడు మామూలు చిత్రాలకే ఆహా ఓహో అని ఊగిపోవడం కనిపిస్తోంది. అవే చిత్రాలను మన వాళ్లు చూసి పెదవి విరుస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర తిప్పి కొడుతున్నారు. అజిత్, విజయ్ లాంటి టాప్ స్టార్లు చేసే సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
కానీ ఆ రొటీన్ మాస్ మసాలా సినిమాలనే వాళ్లు నెత్తిన పెట్టుకుంటున్నారు. గత నెలలో వచ్చిన అజిత్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా సాధారణ చిత్రం. అయినా అది తమిళంలో బాగా ఆడింది. ఇక వర్తమానంలోకి వస్తే.. సూర్య నటించిన ‘రెట్రో’ మూవీ చూసిన మన ప్రేక్షకులంతా బెంబేలెత్తిపోయారు. తెలుగు వారి దత్తపుత్రుడిగా భావించి సూర్య నుంచి ఓ సినిమా వస్తుందంటే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. కానీ అతను కూడా వరుసగా పేలవమైన సినిమాలతో నిరాశపరుస్తున్నాడు. ‘రెట్రో’ అతడి కమ్ బ్యాక్ అవుతుందన్న ఆశతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చుక్కలు చూపించాడు.
అసలు ఆ కథేంటో.. హీరో క్యారెక్టరేంటో.. ఆ సన్నివేశాలేంటో అర్థం కాక.. మినిమం ఎమోషన్ లేక రెండున్నర గంటల సినిమాను పూర్తి చేయడం చాలా కష్టమైంది. దీంతో తొలి రోజే ‘రెట్రో’ తెలుగులో బకెట్ తన్నేసింది. రెండో రోజు నుంచి థియేటర్లు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఇక్కడ ఆ సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. కానీ తమిళంలో మాత్రం ఈ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. వసూళ్లు కూడా బాగున్నాయి. వీకెండ్ వరకు చూస్తే సినిమా హిట్ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు భాషల ప్రేక్షకుల అభిరుచిలో కొంత తేడా ఉండొచ్చు కానీ.. మరీ ఇంత వైరుధ్యం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on May 4, 2025 7:49 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…