ఒక ఏ రేటెడ్ వయొలెంట్ సినిమాకు మొదటి రోజు నలభై మూడు కోట్లు రావడం చిన్న విషయం కాదు. మూడు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండింగ్ కావడం అంత తేలిగ్గా తీసుకునేది కాదు. వీకెండ్ టికెట్ల అమ్మకాలు అంతకన్నా బలంగా ఉండటం ఆషామాషి కాదు. ఇవన్నీ మాములుగా ఒక టయర్ 1 హీరో ప్యాన్ ఇండియా మూవీకి జరిగే విశేషాలు. కానీ నాని ఈ గేమ్ ని మార్చేశాడు. ఈ ఒక్క సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతారని తెలిసినా సరే రిస్క్ చేశాడు. కంటెంట్ మీద నమ్మకంతో మాస్, యూత్ ని లక్ష్యంగా పెట్టుకుని ఒక డిజాస్టర్ వెనకాల పెట్టుకున్న శైలేష్ కొలను ప్రతిభను నమ్మి దానికి తగ్గ ఫలితం అందుకున్నాడు.
హిట్ 3 ఎప్పటికీ చెప్పుకునే ఎవర్ గ్రీన్ క్లాసిక్ అవ్వొచ్చు, కాకపోవచ్చు. అది ఇప్పుడే చెప్పలేం. కానీ బాక్సాఫీస్ స్టామినాను సరైన రీతిలో వాడుకోవడం ఎలాగో నిరూపించిన బెస్ట్ ఎగ్జాంపుల్ గా మాత్రం చెప్పాల్సిందే. ఇక్కడ నాని బ్రాండ్ ఎంత బలంగా పని చేసిందంటే అన్నేసి ఇంటర్వ్యూలు ఇచ్చి, ఈవెంట్లు చేసి సోషల్ మీడియా మొత్తం తనే కనిపిస్తుంటే జనంలో ఒక రకమైన సానుకూల దృక్పథం కనిపించింది. ఇంత కష్టపడి చెబుతున్నాడంటే ఖచ్చితంగా బాగుండొచ్చనే నమ్మకం కలిగింది. ఇలాంటి ప్రమోషన్లు అందరూ చేస్తారు నిజమే. కానీ నాని మీద పెట్టుకున్న నమ్మకం దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో ప్రూవైపోయింది కాబట్టే ఇంత స్పందన దక్కింది.
టాక్ వినగానే నాని రిలాక్స్ అయిపోలేదు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ప్రమోషన్ల కోసం అమెరికా వెళ్ళిపోయాడు. తన బలమైన మార్కెట్లో స్వయంగా ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు రెడీ అయ్యాడు. నిజానికిదంతా ఖరీదయిన వ్యవహారం. నిర్మాత నానినే కాబట్టి ఫ్లైట్ టికెట్ల దగ్గర నుంచి యుఎస్ లో అయ్యే వ్యయాల దాకా మొత్తం తనే భరించాలి. ఇలా చేయడం వల్ల పది మంది చూసే సినిమా పాతిక మందికి చేరుతుందనే నాని క్యాలికులేషన్ ని మెచ్చుకోవలసిందే. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ది ప్యారడైజ్ వచ్చినప్పుడు కలిగే హైప్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. రేంజ్ అంతగా పెరిగింది మరి.
This post was last modified on May 3, 2025 2:21 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…