Movie News

నాని ఎదుగుదల చూశారా?

బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదగడం అంత తేలికైన విషయం కాదు. ఎంతో ప్రతిభ ఉండాలి. కథల ఎంపికలో నైపుణ్యం ఉండాలి. దీంతో పాటుగా కొంచెం అదృష్టం కూడా తోడవ్వాలి. నాని కెరీర్లో ఇవన్నీ ఉండబట్టే స్టార్ హీరోగా నిలబడ్డాడు. ఇండస్ట్రీలో నిలకడగా విజయాలు అందుకుంటూ సినిమా సినిమాకూ రేంజ్ పెంటుకుంటున్న హీరోగా నాని పేరే ముందు వరుసలో చెప్పుకోవాలి. పదేళ్ల ముందు ‘భలే భలే మగాడివోయ్’తో 50 కోట్ల వసూళ్ల మార్కును అందుకుంటే అందరూ ఔరా అనుకున్నారు. కానీ ఇప్పుడు వంద కోట్ల వసూళ్లు కూడా నానికి తేలికైపోయింది.

రెండేళ్ల కిందట ‘దసరా’తో తొలిసారి అతను వంద కోట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పుడు ‘హిట్-3’తో మరోసారి ఆ మైల్‌స్టోన్‌ను అందుకోవడం లాంఛనమే కాబోతోంది. తొలి రోజు ఓపెనింగ్స్‌ను పరిశీలిస్తే నాని ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. నాని కెరీర్లో ఓపెనింగ్స్ పరంగా ట్రేడ్ వర్గాలను ఎక్కువ ఆశ్చర్యపరిచిన సినిమా అంటే.. ‘ఎంసీఏ’ అనే చెప్పాలి. నేచురల్ స్టార్ కెరీర్లో తొలి పూర్తి స్థాయి మాస్ సినిమాగా కూడా దాన్నే చెప్పాలి. దానికి 2017లోనే రూ.15 కోట్ల మేర ఓపెనింగ్స్ వచ్చాయి. నాని రేంజ్‌ను ఒక్కసారిగా పెంచిన చిత్రమిది.

ఆ తర్వాత నుంచి తన సినిమాలకు 10 కోట్ల ఓపెనింగ్స్ కామన్ అయింది. ‘దసరా’ చిత్రం మాత్రం ఒకేసారి నానిని పెద్ద రేంజికి తీసుకెళ్లిపోయింది. ఆ చిత్రానికి ఏకంగా రూ.38 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. ఐతే తర్వాత క్లాస్ టచ్ ఉన్న హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలు చేయడంతో ఆ స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. కానీ ఇప్పుడు ‘హిట్-3’లో హీరోయిజం వేరే లెవెల్లో ఉండడం, మాస్‌కు కనెక్ట్ కావడం, ప్రి రిలీజ్ హైప్ పీక్స్‌కు చేరుకోవడంతో ఓపెనింగ్స్ ఊహించని స్థాయిలో వచ్చాయి. ఏకంగా రూ.43 కోట్ల వసూళ్లతో సంచలనం రేపింది ‘హిట్-3’. ‘ది ప్యారడైజ్’కు ఇప్పటికే కావాల్సినంత హైప్ వచ్చిన నేపథ్యంలో రూ.50 కోట్ల ఓపెనింగ్ అన్నది నానికి ఈజీ టార్గెట్ అని చెప్పొచ్చు. ఇలా సినిమా సినిమాకూ నాని రేంజ్ పెరిగిపోతుండడం విశేషం.

This post was last modified on May 2, 2025 7:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago