ఒక టైంలో నిలకడగా హిట్లు కొడుతూ మంచి ఊపులో కనిపించాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. కానీ కొన్నేళ్లుగా అతడికి విజయాలు లేవు. కానీ అతడికి అవకాశాలకైతే లోటు లేదు. ఏడాదిలో రెండు రిలీజ్‌లు ఉండేలా చూసుకుంటున్నాడు. చేతిలో రెండు మూడు సినిమాలైతే ఉంటున్నాయి. గత ఏడాది ‘లైలా’ మూవీతో గట్టి ఎదురు దెబ్బ తిన్న విశ్వక్.. ప్రస్తుతం ‘ఫంకీ’ అనే వెరైటీ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో పాటు శ్రీధర్ గంట అనే కొత్త దర్శకుడితో విశ్వక్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశారు. అది ఇంకా సెట్స్ మీదికి వెళ్లినట్లు లేదు.
ఈలోపే ఈ యంగ్ హీరోతో మరో సినిమా తెరపైకి వచ్చింది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు ఈ సినిమాను నిర్మించబోతుండడం విశేషం. తెలంగాణ రాజకీయాల్లో బాగా ఫేమస్ అయిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్.. విశ్వక్ హీరోగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఆ సినిమాకు ‘కల్ట్’ అనే వెరైటీ టైటిల్ ఖాయం చేశారు. సోషల్ మీడియా కాలంలో ‘కల్ట్’ అనేది బాగా పాపులర్ మాట.
ఒకప్పుడు గొప్ప సినిమాలను ‘క్లాసిక్’ అనేవాళ్లు. ఇప్పుడు ‘కల్ట్’ అంటున్నారు. ఈ పేరుతో విశ్వక్ సినిమా చేయడం విశేషమే. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట. తలసాని వారికి సినిమా నిర్మాణం కొత్తేమీ కాదు. శ్రీనివాస్ సోదరుడు శంకర్ యాదవ్ ఇప్పటికే ‘చిన్ని చిన్ని ఆశ’ అనే సినిమా ప్రొడ్యూస్ చేశాడు. సాయికిరణ్.. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాబోతోంది.
This post was last modified on May 2, 2025 7:52 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…